ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 3లోకి శుబ్‌మన్ గిల్... మరో సెంచరీ చేస్తే బాబర్ ఆజమ్‌కి పోటీగా...
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 3కి ఎగబాకిన శుబ్‌మన్ గిల్... పాకిస్తాన్‌తో సూపర్ 4 రౌండ్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేస్తే, టాప్ 2కి వెళ్లే ఛాన్స్..

ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్, ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 3లోకి ఎగబాకాడు. నేపాల్‌తో భారీ సెంచరీ చేసిన బాబర్ ఆజమ్, 882 పాయింట్లతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు..
రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్ దేర్ దుస్సేన్‌కి (777 పాయింట్లు), బాబర్ ఆజమ్‌కీ మధ్య 105 పరుగుల వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం 750 పాయింట్లతో టాప్ 3లో ఉన్న శుబ్‌మన్ గిల్, పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో సెంచరీ చేస్తే.. టాప్ 2లోకి ఎగబాకుతాడు..
ఇదే మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ని భారత బౌలర్లు తక్కువ స్కోరుకి అవుట్ చేయగలిగితే, శుబ్‌మన్ గిల్, టాప్ ప్లేస్‌కి పోటీదారుడిగా మారతాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు టీమిండియా, ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది..
ఈ వన్డే సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ చేసే పరుగులు, ఐసీసీ వన్డేల్లో టాప్ ర్యాంకుకి అతన్ని మరింత చేరువ చేస్తాయి. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ టాప్ 4లో ఉంటే, ఐర్లాండ్ బ్యాటర్ హారీ టెక్టర్ 726 పాయింట్లతో టాప్ 5లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్, ఫకార్ జమాన్, క్వింటన్ డి కాక్, స్టీవ్ స్మిత్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఉన్నాడు. రోహిత్ శర్మ 11వ స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరికీ తేడా 5 పాయింట్లు మాత్రమే. పాకిస్తాన్‌తో సూపర్ 4 మ్యాచ్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసి, విరాట్ కోహ్లీ విఫలమైతే... ర్యాంకులు తారుమారు అవుతాయి..
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 82 పరుగులు చేసిన టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 24కి ఎగబాకాడు. శ్రేయాస్ అయ్యర్ టాప్ 33లో, శిఖర్ ధావన్ 45, కెఎల్ రాహుల్ 46 స్థానాల్లో ఉన్నారు..
సూర్యకుమార్ యాదవ్, టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతుంటే, వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ టాప్ 8కి పడిపోయాడు. ఈ ఏడాది ఆరంభంలో టాప్‌లో ఉన్న సిరాజ్, గత వారం టాప్ 4లో ఉన్నాడు..
వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్ధిక్ పాండ్యాకి టాప్ 10 ర్యాంకు దక్కింది. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ టాప్ 10లో ఉంటే, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంకుని నిలుపుకోగలిగాడు.. రవీంద్ర జడేజా టాప్ 3లో ఉన్నాడు..
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 62 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 67 పరుగులు చేయగా, కెప్టెన్ రోహిత్ శర్మ 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి అజేయంగా 147 పరుగులు జోడించి, టీమిండియాకి 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందించారు.