Asianet News TeluguAsianet News Telugu

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శుబ్‌మన్ గిల్- సారా టెండూల్కర్? యూఏఈ క్రికెటర్ కామెంట్లతో...

త్వరలోనే శుబ్‌మన్ గిల్ పెళ్లి! సారా టెండూల్కర్‌తో రిలేషన్‌లో ఉన్నాడు... ఇంటర్వ్యూలో బయటపెట్టిన యూఏఈ క్రికెటర్ చిరాగ్ సూరి.. 

Shubman gill going to marry Sara Tendulkar, marriage on cards, UAE cricketer chirag suri reveals CRA
Author
First Published Nov 10, 2023, 2:22 PM IST

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉందని దాదాపు నాలుగేళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్లతో వీరి మధ్య రిలేషన్ గురించి బయటికి వచ్చింది. అయితే ఈ ఇద్దరూ ఎప్పుడూ కలిసి బయట కనిపించలేదు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోల ద్వారా ఒకే రెస్టారెంట్‌లో ఉన్నట్టు తేలిపోయింది. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నాడు యూఏఈ క్రికెటర్ చిరాగ్ సూరి..

లోవిన్ దుబాయ్ అనే ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరాగ్ సూరికి‘మీలో నెక్ట్స్ పెళ్లి చేసుకోబోయే క్రికెటర్ ఎవరు?’ అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఏ మాత్రం ఆలోచించకుండా ‘శుబ్‌మన్ గిల్’ అని సమాధానం ఇచ్చాడు చిరాగ్ సూరి..

‘ఆమె పేరేంటి?’ అంటే.. ‘సారా, సచిన్ టెండూల్కర్ కూతురు. మాజీ GOAT క్రికెటర్. ఆమె తన తండ్రి ఆడడాన్ని పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉండి ఉంటుంది. ఇప్పుడు మరో 40 ఏళ్లు వాళ్ల ఆయన ఆడడం చూడాల్సి ఉంటుంది.

కొన్నిసార్లు మనం దేన్నైనా అధికంగా ఇష్టపడితే, దాన్ని వదిలి ఉండలేం. ఎంత దూరంగా వెళ్లాలని అనుకున్నా, అది వెంటబడి వస్తుంది. ఈ అమ్మాయి విషయంలో అదే జరగబోతోంది..’ అంటూ కామెంట్ చేశాడు..

చిరాగ్ సూరి కామెంట్లతో ఇన్నాళ్లు శుబ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం కేవలం రూమర్లు మాత్రమేనని అనుకున్న క్రికెట్ ఫ్యాన్స్, ఫుల్లు క్లారిటీ వచ్చేసింది. 


కొన్నాళ్ల కిందట శుబ్‌మన్ గిల్, బాలీవుడ్ హీరోయిన్ సారా ఆలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో ఈ వార్తలపై స్పందించింది సారా ఆలీ ఖాన్..

‘నువ్వు శుబ్‌మన్ గిల్‌తో డేటింగ్‌లో ఉన్నావా?’ అంటూ కరణ్ జోహార్ ప్రశ్నించాడు. ‘మీరు అనుకుంటున్న సారా నేను కాదు. ఆమె వేరు! అతను నాకు ఫ్రెండ్ కూడా కాదు. మాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు..’ అంటూ కామెంట్ చేసింది సారా ఆలీ ఖాన్.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios