44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...రెండు వికెట్లు తీసిన జోఫ్రా ఆర్చర్...29 పరుగులు చేసి పెవిలియన్ చేరిన శుబ్‌మన్ గిల్..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 28 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసిన యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్... జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అండర్సన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది.. రోహిత్ శర్మ 6 పరుగులకే అవుటైన సంగతి తెలిసిందే. భారత జట్టు కోల్పోయిన రెండు వికెట్లు ఆర్చర్ బౌలింగ్‌లోనే కావడం విశేషం. భారత బౌలర్లు వికెట్లు తీయడానికి కష్టపడిన చోటే, తెలివిగా బౌలింగ్ చేస్తూ ఫలితాలు రాబడుతోంది ఇంగ్లాండ్.
టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ పూజారా, భారత సారథి విరాట్ కోహ్లీ నిర్మించే భాగస్వామ్యంపైనే భారత జట్టు స్కోరు ఆధారపడి ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 578 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
