ఉత్త‌మ క్రికెట‌ర్‌గా గిల్.. రవిశాస్త్రికి సీకేనాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్.. బీసీసీఐ అవార్డులు పూర్తి జాబితా

BCCI Naman Awards: హైదరాబాద్ లో బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. భార‌త ఉత్త‌మ క్రికెట‌ర్ గా శుభ్‌మ‌న్ గిల్.. లెజెండరీ క్రికెటర్లు ఫరూక్ ఇంజనీర్, రవిశాస్త్రిలకు సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు లభించింది.
 

shubhman gill is india's best cricketer,  Ravi Shastri receives CK Nayudu Lifetime Achievement Award, Here is the complete list of BCCI awards RMA

complete list of BCCI awards: బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ లో ఘ‌నంగా జరిగింది. 2019 తర్వాత తొలిసారి ఆటగాళ్లకు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) బోర్డు అవార్డులు ఇచ్చింది. భారత్- ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ కు ముందు బీసీసీఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు భారత టెస్టు జట్టు ఆటగాళ్లంతా వచ్చారు. ఆటగాళ్లతో పాటు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా వచ్చారు. లెజెండరీ క్రికెటర్లు ఫరూక్ ఇంజనీర్, రవిశాస్త్రిలకు సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు లభించింది.

బీసీసీఐ అవార్డుల విజేతల పూర్తి జాబితా ఇదే..

శుభ్‌మ‌న్ గిల్ - క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (2022-23)
జస్ప్రీత్ బుమ్రా - క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (2021-22)
రవిచంద్రన్ అశ్విన్ - క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (2020-21)
మహ్మద్ షమీ - క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (2019-20)

రవిశాస్త్రి - సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- యశస్వి జైస్వాల్ (2022-23)
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- శ్రేయాస్ అయ్యర్ (2021-22)
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - అక్షర్ పటేల్ (2020-21)
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం- మయాంక్ అగర్వాల్ (2019-20)

 

రంజీ ట్రోఫీ అవార్డులు (దేశ‌వాళీ క్రికెట్)

2019-20 రంజీ ట్రోఫీ అత్యధిక వికెట్లు (మాధవరావు సింధియా అవార్డు): జయదేవ్ ఉనద్కత్
2021-22 రంజీ ట్రోఫీ అత్యధిక వికెట్లు (మాధవరావు సింధియా అవార్డు): షామ్స్ ములానీ
2022-23 రంజీ ట్రోఫీ అత్యధిక వికెట్లు (మాధవరావు సింధియా అవార్డు): జలజ్ సక్సేనా
2019-20 రంజీ ట్రోఫీ అత్యధిక పరుగులు (మాధవరావు సింధియా అవార్డు): రాహుల్ దలాల్
2021-22 రంజీ ట్రోఫీ అత్యధిక పరుగులు (మాధవరావు సింధియా అవార్డు): సర్ఫరాజ్ ఖాన్
2022-23 రంజీ ట్రోఫీ అత్యధిక పరుగులు (మాధవరావు సింధియా అవార్డు): మయాంక్ అగర్వాల్

 

దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లకు అవార్డులు

బీసీసీఐ డొమెస్టిక్ టోర్నమెంట్ (2019-20)లో ఉత్తమ క్రికెట్ అసోసియేషన్ అవార్డు: ముంబై
బీసీసీఐ దేశవాళీ టోర్నమెంట్ (2021-22)లో ఉత్తమ క్రికెట్ అసోసియేషన్ అవార్డు: మధ్యప్రదేశ్
బీసీసీఐ డొమెస్టిక్ టోర్నమెంట్ (2022-23)లో బెస్ట్ క్రికెట్ అసోసియేషన్ అవార్డు: సౌరాష్ట్ర

మహిళా క్రికెటర్లకు అవార్డులు

2019-20 అత్యధిక వన్డే వికెట్లు (మహిళలు) : పూనమ్ యాదవ్
2020-21 అత్యధిక వన్డే వికెట్లు (మహిళలు) : జులన్ గోస్వామి
2021-22 అత్యధిక వన్డే వికెట్లు (మహిళలు) : రాజేశ్వరి గైక్వాడ్
2022-23 అత్యధిక వన్డే వికెట్లు (మహిళలు) : దేవికా వైద్య
2019-20 అత్యధిక వన్డే పరుగులు (మహిళలు) : పూనమ్ రౌత్
2020-21 అత్యధిక వన్డే పరుగులు (మహిళలు) : మిథాలీ రాజ్
2021-22 అత్యధిక వన్డే పరుగులు (మహిళలు) : హర్మన్ప్రీత్ కౌర్
2022-23 అత్యధిక వన్డే పరుగులు (మహిళలు) : జెమీమా రోడ్రిగ్స్

 

దిలీప్ సర్దేశాయ్ అవార్డు (ఇండియా-వెస్టిండీస్ 2023 సిరీస్)

2022-23లో అత్యధిక టెస్టు వికెట్లు : రవిచంద్రన్ అశ్విన్
2022-23 అత్యధిక టెస్టు పరుగులు : యశస్వి జైస్వాల్

2019-20 ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు) : ప్రియా పూనియా
2020-21 ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు) : షెఫాలీ వర్మ
2021-22 ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు) : ఎస్ మేఘనా
2022-23 ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు) : అమన్జోత్ కౌర్

ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు) : మయాంక్ అగర్వాల్
2020-21 ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు) : అక్షర్ పటేల్
2021-22 ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు) : శ్రేయాస్ అయ్యర్
2022-23 ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు) : యశస్వి జైస్వాల్
2019-20 ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (మహిళలు) : దీప్తి శర్మ
2020-22 ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (మహిళలు) : స్మృతి మంధాన
2022-23 ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (మహిళలు) : దీప్తి శర్మ

పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్న ప్లేయ‌ర్లు

2019-20 ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ : మహ్మద్ షమీ
2020-21లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ : రవిచంద్రన్ అశ్విన్
ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ : జస్ప్రీత్ బుమ్రా
ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ : శుభ్మన్ గిల్

 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios