కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి.

దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న మొదట్లొ క్రీడాకారులంతా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ఒకరిపై మరొకరు విసిరారు.

 

సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు ఇంటర్వ్యూలు చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. కాగా.. శిఖర్ ధావన్ మాత్రం డ్యాన్స్ కి స్టెప్పులు వేస్తున్నాడు. కూతురి బర్త్ డే సందర్భంగా ఈ డ్యాన్స్ చేయడం విశేషం.

శిఖ‌ర్ ధావ‌న్.. త‌న కూతురు ఆలియా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక డ్యాన్స్ వీడియోను పోస్టు చేశాడు. వినూత్నంగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఇద్ద‌రు క‌లిసి స్టెప్పులెస్తూ సంద‌డి చేశారు.

నిజానికి ఆలియా.. ధావ‌న్‌కు స్టెప్ డాట‌ర్ కావ‌డం గమనార్హం. గ‌తంలో ఆలియాతో క‌లిసి తాను డ్యాన్స్ చేసిన వీడియోను పోస్టు చేసిన ధావ‌న్‌.. హ్యాపీ బ‌ర్త్ డే మై ఏంజెల్ అని‌, ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్ చేశాడు. ముఖ్య‌మైన ఈ వేళ త‌న‌ను ఎంతో మిస్స‌వుతున్నాన‌ని పేర్కొన్నాడు. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకు‌ని, ఈ సంతోష స‌మ‌యాన్ని ఆస్వాదించాల‌ని కోరుకున్నాడు.