Asianet News TeluguAsianet News Telugu

ICC T20 World Cup: రేపు బీసీసీఐ కీ మీటింగ్.. ఆ ముగ్గురి భవితవ్యం తేల్చనున్న బోర్డు పెద్దలు.. హార్ధిక్ ఉంటాడా?

BCCI: మెగా టోర్నీకి ఇతర దేశాల జట్లన్నీ సర్వసన్నద్ధమవుతుంటే భారత్ మాత్రం ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శనివారం  కీలక సమావేశం నిర్వహించనున్నది. 

selectors and bcci to meet on saturday to discuss key issues in team india will squad change for the T20 world cup?
Author
Hyderabad, First Published Oct 8, 2021, 8:06 PM IST

IPL లీగ్ దశ ముగిసి Playoffsకు తెర లేచిన తరుణంలో భారత క్రికెట్ బోర్డు పెద్దలు శనివారం దుబాయ్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు.  మరో వారం రోజుల్లో ICC T20 World cup  మొదలుకానున్న నేపథ్యంలో ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి India జట్టును ప్రకటించగా.. పలువురు ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్ పై ఆందోళన నెలకొన్నది. దీంతో వారిని మారుస్తారా..? లేక కొనసాగిస్తారా..? అనేదానిపై బీసీసీఐ పెద్దలు చర్చించనున్నట్టు సమాచారం. 

ప్రధానంగా ఈ మీటింగ్ లో ఆల్ రౌండర్ Hardik pamdya గురించి చర్చించే అవకాశముంది. Fitness లేమితో బాధపడుతున్న పాండ్యా.. ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో అనుకున్న స్థాయిలో రాణించలేదు. అంతేగాక అతడు బౌలింగ్ కూడా చేయలేదు. పాండ్యాతో పాటు ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్ ల ఫామ్ పైనా సెలెక్టర్లు చర్చ జరుగనున్నదని తెలుస్తున్నది. 

ఈ కింది  అంశాల మీద సమావేశంలో చర్చించనున్నట్టు బీసీసీఐ ప్రతినిధుల ద్వారా తెలిసింది. 
1. ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేయాలా..? 
2. ఒకవేళ చేస్తే.. Ishan Kishan స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను తీసుకోవడానికి టీమ్ మేనేజ్మెంట్ అంగీకారం తెలుపుతుందా..? 
3. టీ20 ప్రపంచకప్ లో హర్ధిక్ పోషించే పాత్ర ఏమిటి..?
4. ఒకవేళ అతడు బౌలింగ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే స్పెషలిస్టు బ్యాట్స్మెన్ గా శ్రేయస్ అయ్యర్ గానీ, ఆల్ రౌండర్ గా శార్ధుల్ ఠాకూర్ ను తీసుకుంటే ఎలా ఉంటుంది..? 
5. ఐపీఎల్ లో విఫలమైన రాహుల్ చాహర్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్ ను తీసుకునే అంశం.

ఈ మీటింగ్ కు భారత కెప్టెన్ Virat Kohli, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రవిశాస్త్రి, బీసీసీఐ సెక్రెటరీ జై షా తో పాటు సెలక్షన్ కమిటీ హెడ్ చేతన్ శరర్మ కూడా హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే జట్టును ప్రకటించినా.. అన్ని జట్లు తమ తుది జట్ల ఫైనల్ జాబితాను ఈనెల 10 వరకు మార్పులు చేసుకుని ఐసీసీకి అందజేయాల్సి ఉంటుంది. మరి రేపటి మీటింగ్ లో భారత జట్టులో ఏ మార్పులు చేయనున్నారో కొద్దిగంటల్లో తెలిసిపోనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios