Asianet News TeluguAsianet News Telugu

సందీప్ లామిచానేకి అవమానం... చేతులు కలిపేందుకు నిరాకరించిన స్కాట్లాండ్ క్రికెటర్లు...

17 ఏళ్ల టీనేజర్‌పై అత్యాచారం చేసినట్టు సందీప్ లామిచానేపై ఆరోపణలు... బెయిల్ ద్వారా జైలు నుంచి బయటికి వచ్చిన నేపాల్ మాజీ కెప్టెన్... స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో సందీప్‌తో చేతులు కలిపేందుకు నిరాకరించిన క్రికెటర్లు.. 

Scotland cricketers refused to shake hands with Rape accused Sandeep Lamichhane cra
Author
First Published Feb 18, 2023, 1:05 PM IST

17 ఏళ్ల టీనేజ్ అమ్మాయిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్ లామిచానేకి ఘోర అవమానం ఎదురైంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న సందీప్‌‌తో చేతులు కలిపేందుకు స్కాట్లాండ్ క్రికెటర్లు నిరాకరించారు.

అత్యాచార ఆరోపణలు వచ్చిన తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన సందీప్, జైలు శిక్ష అనుభవించి.. గత నెలలో బెయిల్ ద్వారా విడుదలయ్యాడు. బెయిల్ ద్వారా బయటికి వచ్చిన సందీప్ లామిచానేపై సస్పెన్షన్ వేటుని ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకుంది నేపాల్ క్రికెట్ అసోసియేషన్..

దీంతో వన్డే వరల్డ్ కరల్డ్ లీగ్ 2 ట్రై సిరీస్‌లో నమీబియాతో మ్యాచ్‌లో పాల్గొన్న సందీప్ లామిచానే, ఖాట్మాండులో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో పాల్గొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు దేశాల క్రికెటర్లు కరచాలనం చేసుకోవడం సంప్రదాయం. అయితే రేప్ నేరారోపణ ఎదుర్కోంటున్న సందీప్‌తో చేతులు కలిపేందుకు స్కాట్లాండ్ ప్లేయర్లు ఇష్టపడకపోవడం, టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికారడ్ు అయ్యింది..

అయితే దీని గురించి స్కాట్లాండ్ ఇప్పటిదాకా కామెంట్ చేయలేదు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 3 వికెట్ల తేడాతో ఓడింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 21న మ్యాచ్ జరగనుంది. అయితే తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలను ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఖండించాడు సందీప్ లామిచానే..

నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన సందీప్, స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.  

22 ఏళ్ల సందీప్ లామిచానే, 2021 డిసెంబర్‌లో నేపాల్ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో ఆడిన అతికొద్ది మంది అసోసియేట్ దేశాల క్రికెటర్లలో లామిచానే ఒకడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున మూడు సీజన్లు ఆడిన సందీప్‌, తనపై రెండు సార్లు అత్యాచారం చేశాడని 17 ఏళ్ల ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది...

బాలిక నుంచి ఫిర్యాదు స్వీకరించిన నేపాల్ పోలీసులు, అతనిపై రేప్ కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్లామిచానే‌పై సస్పెషన్ వేటు వేసింది నేపాల్ క్రికెట్ జట్టు...ఆగస్టు 21న ఖట్మాండులోని ఓ హోటల్ గదిలో సందీప్ లామిచానే తనపై రెండు సార్లు అత్యాచారం చేశాడని, తాను వదిలిపెట్టమని వేడుకున్నా వినకుండా బలవంతం చేశాడని సెప్టెంబర్ 6న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది ఆ 17 ఏళ్ల బాలిక...

బాలిక ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, హోటల్ సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా ఆ సమయంలో సందీప్ లమిచేన్, ఆ బాలికతో ఉన్నట్టు గుర్తించారు. దీంతో అతనిపై ఖట్మాండు జిల్లా కోర్టు అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు... 


కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ల్లో ఆడిన మొట్టమొదటి నేపాల్ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సందీప్ లామిచానే, ఆఫ్ఘానిస్తాన్ ప్రీమియర్ లీగ్, గ్లోబల్ టీ20 కెనడా, బిగ్‌బాష్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, 2021 టీ20 బ్లాస్ట్, లంక ప్రీమియర్ లీగ్ వంటి ఫ్రాంఛైజీ టీ20 లీగుల్లో ఆడాడు.. 

Follow Us:
Download App:
  • android
  • ios