ఇంగ్లాండ్ జట్టును మైదానంలో టీమిండియా చిత్తు  చిత్తుగా ఓడించి.. విజేతగా నిలిచింది. మైదానంలో టీమిండియా విజయ భేరి మోగించగా.. మైదానం బయట.. ఇండియన్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన విన్నర్ గా నిలవడం గమనార్హం. ఆమె ఇంగ్లాండ్ క్రికెటర్లను ట్రోల్ చేసి.... హాట్ టాపిక్ గా మారడం గమనార్హం. 

తొలి వన్డేలో ఇంగ్లాండ్ పై భారత జట్టుు విజయం సాధించింది. దాదాపు 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం గమనార్హం. ప్రపంచ ఛాంపియన్ గా ఉన్న ఇంగ్లాండ్ జట్టును మైదానంలో టీమిండియా చిత్తు చిత్తుగా ఓడించి.. విజేతగా నిలిచింది. మైదానంలో టీమిండియా విజయ భేరి మోగించగా.. మైదానం బయట.. ఇండియన్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన విన్నర్ గా నిలవడం గమనార్హం. ఆమె ఇంగ్లాండ్ క్రికెటర్లను ట్రోల్ చేసి.... హాట్ టాపిక్ గా మారడం గమనార్హం.

ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన టీ20ల మాదిరిగానే వన్డేల్లో కూడా శుభారంభం చేసింది టీమిండియా. టీ20సిరీస్ ను 2-1 తో చేజిక్కించుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ‘ది ఓవల్’ వేదికగా మంగళవారం ముగిసిన తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో గెలుపొందింది. 
మంగళవారం జరిగిన మ్యాచ్ లో బుమ్రా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో తొలుత ఇంగ్లాండ్ టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

తర్వాత ఇంగ్లాండ్ జట్టును 25.2 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌట్ చేసేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఒక్కవికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ లు నాటౌట్ గా నిలిచి ఇంగ్లాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించారు. 

లక్ష్య ఛేదనలో భారత్ ఎక్కడా తడబడలేదు. ఆది నుంచి దూకుడుగానే ఆడిన రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్.. 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శిఖర్ ధావన్ (54 బంతుల్లో 31 నాటౌట్.. 4 ఫోర్లు) తో కలిసి భారత్ కు తొలి విజయాన్ని అందించాడు. 

Scroll to load tweet…

ఇదిలా ఉండగా... మైదానంలో లోపల ఇంగ్లాండ్ క్రికెటర్లను మనవాళ్లు ఆడుకుంటే.. మైదానం బయట బుమ్రా భార్య సంజన ఆడుకున్నారు. ఇంగ్లాండ్ క్రికెటర్లను ట్రోల్ చేస్తూ.. ఆమె ఓ వీడియో షేర్ చేయడం గమనార్హం. ఇంగ్లాండ్ క్రికెటర్లు వరసగా డకౌట్ అవుతుండటాన్ని ప్రస్తావిస్తూ.. ఆమె ట్రోల్ చేయడం గమనార్హం. ఆమె ట్రోల్ చేస్తున్న వీడియోని కింద చూడొచ్చు.

సంజన బ్రాడ్‌కాస్టర్ సోనీ సిక్స్ నెట్‌వర్క్‌తో కలిసి పని చేస్తోంది, ఎడ్జ్‌బాస్టన్‌లో రీషెడ్యూల్ చేయబడిన ఐదవ టెస్ట్ , T20 సిరీస్ , ఇప్పుడు ODI సిరీస్‌ను కూడా కవర్ చేస్తుంది. ఇటీవల బుమ్రా, సంజనలు పెళ్లి పీటలు ఎక్కిన సంగతి కూడా తెలిసిందే.