పాకిస్తాన్ క్రికెటర్, భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. లాహోర్‌లో జాతీయ రహదారిపై షోయబ్ మాలిక్ ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మాలిక్‌కి పెద్దగా గాయాలేమీ కాలేదు.

చిన్న చిన్న గాయాలతోనే ప్రమాదం నుంచి బయటపడ్డాడు షోయబ్ మాలిక్. 21 ఏళ్లుగా క్రికెట్‌ కెరీర్ కొనసాగిస్తున్న షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2018లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా, ఈ ఏడాది ఒలింపిక్స్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.

పాక్ తరుపున 35 టెస్టు మ్యాచులు, 287 వన్డేలు, 116 టీ20 మ్యాచులు ఆడిన షోయబ్ మాలిక్.. మొత్తంగా దాదాపు 10 వేల పరుగులు చేశాడు. గత ఏడాది పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా పాల్గొన్నాడు షోయబ్ మాలిక్.