రాజపక్స రాజీనామా చేయకుండానే దేశం నుంచి పారిపోవడం గమనార్హం. కాగా.. రాజ్యంగంలోని 37(1) నిబంధన లో భాగంగా రణిల్ విక్రమ సింఘేను అధ్యక్షుడిగా నియమించారు.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం వదిలి పరారయ్యారు. ఈ సంఘనతో ఆ దేశంలో ఆందోళనలు మొదలయ్యాయి. తమ అధ్యక్షుడు దేశం వదిలి వెళ్లడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా... శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా లంక స్పీకర్ మహింద యప అబెవర్ధన బుధవారం నియమించారు. రాజపక్స రాజీనామా చేయకుండానే దేశం నుంచి పారిపోవడం గమనార్హం. కాగా.. రాజ్యంగంలోని 37(1) నిబంధన లో భాగంగా రణిల్ విక్రమ సింఘేను అధ్యక్షుడిగా నియమించారు. అంతేకాకుండా... దేశంలో ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు. ఎమర్జెన్సీ ప్రకటనతో ఆ దేశంలోని ప్రజల పరిస్థితి మరింత దారుణంగా మారింది.
ఈ క్రమంలో.. తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమ్ సింఘేపై శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య విమర్శలు గుప్పించారు. ఆయనను.. ప్రముఖ కమెడియన్ పాత్ర మిస్టర్ బీన్ తో పోల్చడం గమనార్హం. ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
‘మిస్టర్ బీన్ ఒక నటుడు మాత్రమేనని.. అతను ఒక క్రికెటర్ కారని సెలక్టర్లు అతనిని తిరస్కరించినప్పటికీ... అతను క్రికెట్ జట్టులోకి అడుగుపెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి’ అంటూ.. సనత్ జయసూర్య ట్వీట్ చేశారు. దానికి తోడు.. అంపైర్ అతనిని ఔట్ చేసినప్పుడు కూడా అతను క్రీజ్ నుంచి బయటకు వెళ్లకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది’ అంటూ తన ట్వీట్ ని కంటిన్యూ చేశారు.
ఇదిలా ఉండగా... అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన తర్వాత శ్రీలంక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ మేరకు శ్రీలంక ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఉటంకిస్తూ AFP వార్త సంస్థ రిపోర్ట్ చేసింది. ఇదిలా ఉంటే శ్రీలంకలోని నిరసనకారులు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ పార్లమెంట్ భవనాన్ని ముట్టడించి తీరుతామని చెబుతున్నారు.
ఇక, శ్రీలంక స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే నెలలో మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక, జూలై 9న అధ్యక్ష భవన్‌లోకి వేలాది మంది ప్రజలు దూసుకు వచ్చారు. ఈ క్రమంలోనే మూడు రోజుల పాటు శ్రీలంకలోనే తలదాల్చుకున్న అధ్యక్షుడు గోటబయ రాజపక్స.. ఎట్టకేలకు దేశం విడిచి పారిపోయారు.
