మనసులో పట్టుదల, సాధించాలన్న తపన, కృషి ఉంటే అంగ వైకల్యాన్ని కూడా జయించవచ్చని ఓ చిన్నారి నిరూపించాడు. కాగా.. అతని కృషిని చూసి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా అయ్యారు. ఓ దివ్యాంగ బాలుడు క్రికెట్ ఆడుతున్న వీడియోని షేర్ చేసిన లక్ష్మణ్ .. సదరు వ్యక్తికి తనదైన శైలిలో సెల్యూట్ చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. దానిని తన సోషల్ మీడియాలో లక్ష్మణ్ షేర్ చేశాడు.

 

ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైన‌ప్ప‌టికీ మాన‌వుల్లోని సాధించాల‌నే త‌ప‌న‌ను అంతం చేయ‌లేవ‌ని, ఈ ప్లేయ‌ర్ స్పిరిట్‌కు తాను సెల్యూట్ చేస్తున్న‌ట్లు వీవీఎస్ కామెంట్ చేశాడు. కాగా.. ఆయన అభిమానులను సైతం ఈ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉండగా.. ఇటీవ‌లే ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన కూడా చ‌లించ‌కుండా, త‌న విద్యార్థుల‌కు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్న ఓ టీచ‌ర్ ప‌ట్టుద‌ల‌ను చూసి భార‌త మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఫ్లాట్ అయిన సంగతి తెలిసిందే. ఆయ‌న కృష్టి, ప‌ట్టుద‌ల ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంద‌ని కొనియాడాడు. 

కేంద్ర‌పాలిత‌ప్రాంతం లడ‌ఖ్‌లోని లేహ్‌కు చెందిన కైఫాయ‌త్ హుస్సేన్.. ఆన్‌లైన్‌లో విద్యార్థుల‌కు పాఠాలు బోధిస్తాడు. అయితే ఇటీవ‌ల క‌రోనా సోక‌డంతో అత‌డిని ఐసోలేష‌న్ వార్డుకు త‌ర‌లించారు. అయితే ఆ వార్డు నుంచే త‌న విద్యార్థుల‌కు పాఠాలు బోధించ‌డం ప్రారంభించాడు. ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ, సోష‌ల్ మీడియాలో ల‌క్ష్మ‌ణ్ పోస్ట్ చేశాడు.