Asianet News TeluguAsianet News Telugu

న్యూజిలాండ్ ఓపెన్ లో చిత్తుచిత్తుగా ఓడిన సైనా...212వ ర్యాంకర్ చేతిలో

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటముల పరంపర కొనసాగుతూనే వుంది. ఇప్పటికే చైనాలో జరిగిన  ఆసియా బ్యాడ్మింటన్ చాపింయన్‌షిప్ లో క్వార్టర్ ఫైనల్ నుండి ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అంతకకంటే ఘోరమైన ఓటమిని ఆమె చవిచూసింది. న్యూజిలాండ్ ఓపెన్ లో సైనా  తొలి రౌండ్ లోనే ప్రత్యర్థి చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 

Saina Nehwal Loses To World Number 212 Wang Zhiyi
Author
New Zealand, First Published May 1, 2019, 7:43 PM IST

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటముల పరంపర కొనసాగుతూనే వుంది. ఇప్పటికే చైనాలో జరిగిన  ఆసియా బ్యాడ్మింటన్ చాపింయన్‌షిప్ లో క్వార్టర్ ఫైనల్ నుండి ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అంతకకంటే ఘోరమైన ఓటమిని ఆమె చవిచూసింది. న్యూజిలాండ్ ఓపెన్ లో సైనా  తొలి రౌండ్ లోనే ప్రత్యర్థి చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 

అయితే హైదరబాదీ స్టార్ షట్లర్ ను ఓడించిన ప్రత్యర్థి ఎవరో ఆమె కంటే మంచి క్రీడాకారిణి అయివుంటారని అనుకుంటే అదీ కాదు. వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాకింగ్స్ లో 212 స్థానంతో చిట్టచివర నిలిచిన వాంగ్ జియి అనే షట్లరు 9వ ర్యాంకర్ అయిన సైనాను ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ ఘోర పరాజయంతో సైనా న్యూజిలాండ్ ఓపెన్ నుండి ఉత్తి చేతులతోనే వెనుదిరగాల్సి వచ్చింది. 

సైనా-వాంగ్ జియి మధ్య  67 నిమిషాల పాటు మ్యాచ్ సాగింది. అయితే తొలి రెండు సెట్లలో హోరాహోరీగా సాగిన మ్యాచ్ చివరి సెట్లో మాత్రం ఏకపక్షమయ్యింది. తొలి  గేమ్ లో మొదటి నుండి  దూకుడుగా ఆడిన వాంగ్ జియి  సైనాపపై ఆదిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే ఈ రౌండ్లో సైనా కూడా  శక్తివంచన లేకుండా పోరాడింది. 

ఇక రెండో సెట్ హోరాహోరీగా సాగినా సైనా ఆధిపత్యాన్ని సాధించింది. 23-21 తేడాతో వాంగ్ జియిపై కేవలం 2 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్ లో మాత్రం సైనా పూర్తిగా తేలిపోయింది. వాంగ్ జియి దాటికి తట్టుకోలేక 4-21 తో ఓటమిపాలయ్యింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 16-21, 23-21, 4-21తో సైనాను వాంగ్ జియి ఓడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios