టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. సోమవారం తన 25వ పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. 1995 సంవత్సరంలో ఆయన అంజలిని వివాహమాడారు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. సారా టెండుల్కర్, అర్జున్ టెండుల్కర్. కాగా...  తమ 25వ పెళ్లి రోజు సందర్భంగా సచిన్ తన కుటుంబసభ్యులకు ఓ ప్రత్యేకమైన కానుక అందించారు. తన స్వహస్తాలతో ఆయన కుటుంబసభ్యుల కోసం మ్యాంగో కుల్ఫీ తయారు చేశారు. 

"మా వివాహ వార్షికోత్సవం కోసం ఓ సర్‌ప్రైజ్‌ ఇది. అందరినీ ఆశ్చర్యపరిచేందుకు మామిడి కుల్ఫీ తయారు చేశా" అని సచిన్‌ పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన సచిన్.. కాస్త విభిన్నంగా మ్యాంగో కుల్ఫీ ఎలా చేయాలో కూడా సచిన్ వివరించారు. ఈ వీడియోలో సచిన్ తల్లి కూడా కనిపించారు. 

కుల్ఫీ పూర్తయిన తర్వాత దాన్ని టేస్ట్ చేసిన సచిన్.. ‘‘అద్భుతంగా ఉంది.. ఇంకా తినాలని ఉంది కానీ, వారి కోసం దాచి ఉంచుతాను. అందరం కలిసి తింటాము’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోని మీరూ చూసేయండి...

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Made this Mango Kulfi as a surprise for everyone at home on our 25th wedding anniversary. 🥭 ☺️

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on May 25, 2020 at 7:18am PDT

 

ఇదిలా ఉండగా.. మొన్నటికి మొన్న కొడుకు అర్జున్ టెండుల్కర్ కి హెయిర్ కట్ చేసి షాకిచ్చిన సచిన్... ఇప్పుడు ఇలా కిచెన్ లో మామిడి కుల్ఫీ తయారు చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. తమ క్రికెట్ దేవుడు సచిన్ ని కేవలం బ్యాటింగ్ లో లెజెండరీగా చూసిన అభిమానులకు.. ఈ లాక్ డౌన్ సమయంలో తనలోని మరిన్ని కోణాలు చూపిస్తూ.. ఆశ్చర్యపరుస్తున్నారు. సచిన్ పోస్టులకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ అదిరిపోతోంది.