వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో పంచుకుంటున్న సచిన్ టెండూల్కర్. తాజాగా పోస్టు చేసిన వీడియోకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన...

సచిన్... సచిన్... సచిన్... దాదాపు మూడు దశాబ్దాల పాటు స్టేడియంలో ఈ పేరు మార్మోగిపోయింది. చాలామంది సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ చూడడమే మానేశారు. అంతలా అభిమానులను సంపాదించుకున్న ఒకే ఒక్కడు ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్.

రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్‌గా కూడా, ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటర్‌గా వ్యవహారిస్తోన్న సచిన్... తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటాడు.

తాజాగా ఓ పిల్లితో ఆడుకుంటున్న ఫోటోను పోస్టు చేసిన సచిన్ టెండూల్కర్... ‘మై న్యూ ఫ్రెండ్ ఈజ్ బ్యాక్... దీన్ని చూస్తుంటే ఇంతకుముందు వచ్చినప్పుడు తిన్న వడాపావ్‌ని బాగా మిస్ అవుతుందనుకుంటా...’ అంటూ కామెంట్ చేశాడు. సచిన్ ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైక్స్‌ రావడం విశేషం. 

వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి... 

View post on Instagram