Asianet News TeluguAsianet News Telugu

RRvsMI: ముంబైకి బెన్‌ ‘స్టోక్’, సంజూ మెరుపులు... భారీ స్కోరును ఊదేసిన రాయల్స్...

సీజన్‌లో తొలిసారి స్టోక్ పవర్ చూపించిన బెన్‌స్టోక్స్... అద్భుత సెంచరీతో చెలరేగిన బెన్‌స్టోక్స్...

సంజ శాంసన్ అద్భుత హాఫ్ సెంచరీ...

మూడో వికెట్‌కి 144 పరుగుల భారీ భాగస్వామ్యం...

రాజస్థాన్ విజయంతో ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్...

RR vs MI: Rajasthan Royals chased huge target against table topper mumbai indians CRA
Author
India, First Published Oct 25, 2020, 11:07 PM IST

IPL 2020: మొదటి రెండు మ్యాచులు గెలిచి, అందర్నీ ఆశ్చర్యపరిచిన రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత మళ్లీ ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చింది. రాబిన్ ఊతప్ప, స్టీవ్ స్మిత్ ఫెయిల్ అయినా బెన్‌స్టోక్స్, సంజూ శాంసన్ కలిసి భారీ లక్ష్యాన్ని ఊదేశారు.

196 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. రాబిన్ ఊతప్ప 13 పరుగులు చేసి అవుట్ కాగా, స్టీవ్ స్మిత్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్, మరో మ్యాచ్ చెత్తగా ఓడిపోతుందని అనిపించింది.

అయితే కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్ అందుకోవడానికి ఇబ్బంది పడుతున్న బెన్ స్టోక్స్, సంజూ శాంసన్ కలిసి అనూహ్య భాగస్వామ్యంలో ఆర్‌ఆర్‌ను విజయతీరాలకు చేర్చారు.. రాజస్థాన్ రాయల్స్ తరుపున మొట్టమొదటి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న బెన్‌స్టోక్స్, ఆ తర్వాత కూడా బౌండరీల మోత మోగించి సెంచరీ మార్క్ అందుకున్నాడు. సంజూ శాంసన్ తర్వాత మొదటి రెండు మ్యాచుల తర్వాత సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ చేశాడు.

మూడో వికెట్‌కి 144 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఇద్దరూ సిక్సర్లు బాదుతూ భారీ లక్ష్యాన్ని చిన్నబోయేలా చేశారు. బెన్ స్టోక్స్ 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 107 పరుగులు చేయగా, సంజూ శాంసన్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ విజయంతో చెన్నై ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios