అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సంజూ శాంసన్...సిక్సర్ల మోతతో ‘గేమ్ ఛేంజర్’గా మారిన రాహుల్ త్రివాటియా... స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్...
IPL 2020 ఫ్యాన్స్‌కు కావాల్సినంత క్రికెట్ మజాను అందించింది నేటి మ్యాచ్. ఆఖరి ఓవర్ వరకూ చేతుల మారుతూ, ట్విస్టుల మీద ట్విస్టులను రుచి చూపిస్తూ సాగింది రాజస్థాన్, పంజాబ్ మధ్య మ్యాచ్. 224 పరుగుల భారీ టార్గెట్. 19 పరుగులకే స్టార్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ అవుట్. అయినా ఆగకుండా జోరు కొనసాగించారు స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత స్టీవ్ స్మిత్ కూడా అవుట్ కావడంతో మ్యాచ్ పంజాబ్‌కే వెళ్లిపోతుందని అనుకున్నారంతా.
అయితే సంజూ శాంసన్ అద్భుతంగా పోరాడాడు. టూ డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రివాటియా మొదట జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించాడు. అయితే 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేసిన సంజూ శాంసన్ అవుటైన తర్వాత తన గేమ్ ప్లేను మొత్తం మార్చేశాడు రాహుల్ త్రివాటియా.
18 బంతుల్లో 51 పరుగులు కావాల్సిన దశలో ఏకంగా 5 సిక్సర్లు బాది 30 పరుగులు రాబట్టాడు రాహుల్ త్రివాటియా. రాహుల్ సిక్సర్ల మోతతో మ్యాచ్ మలుపు తిరిగింది. రాహుల్ అవుటైన తర్వాత ఆర్చర్ కూడా సిక్సర్లు బాదడంతో రాజస్థాన్ చేతుల్లోకి మ్యాచ్ వెళ్లిపోయింది. ఐదు బంతుల్లో 2 పరుగులు కావాల్సిన దశలో పరాగ్ వికెట్ తీసినా... ఆ తర్వాతి బంతికి బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు టామ్ కుర్రాన్.
