Asianet News TeluguAsianet News Telugu

RCB: కప్పు రాకపోయినా సరే.. తగ్గేదేలే..! సూపర్ మ్యూజిక్ వీడియో చేసిన ఆర్సీబీ.. కొరియోగ్రాఫర్ ఎవరంటే..?

RCB Musical Video: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ మ్యూజిక్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఆ జట్టుకు చెందిన విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, చాహల్ వంటి ఆటగాళ్లు ఇందులో ఆడిపాడారు. #Playbold స్ఫూర్తితో  ఈ వీడియోను రూపొందించారు. 

Royal challengers Banglore release Exiting Music Video which Was choreographed By Dhanashree Verma, Dedicated To Team Fans
Author
Hyderabad, First Published Nov 23, 2021, 2:30 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓ ప్రత్యేకమైన స్థానముంది. ఆ జట్టులో స్టార్లకు కొదవలేదు.  ప్రతిభావంతులైన ఆటగాళ్లకు లోటు లేకున్నా ఇప్పటివరకు 14 సీజన్లు గడిచినా ఆ జట్టు కప్పు కొట్టలేదు. అయినా ఆ జట్టుపై ఉండే క్రేజ్ మాత్రం అభిమానులకు ఏ మాత్రం తగ్గదు.  ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యేప్పుడు బెంగళూరు అభిమాని నోటి నుంచి వినిపించే మాట.. ‘ఈ సాలా కప్ నమదే..’ (ఈసారి కప్పు మనదే..) కానీ ఇప్పటివరకు వాళ్ల కోరిక నెరవేరలేదు. అయితే కప్పుతో సంబంధం లేకుండా తాము మాత్రం  పోరాటం చేస్తూనే ఉంటామని ఆ జట్టు తెలిపింది. ఇందుకు సంబంధించి తాజాగా ఆ జట్టు ఓ  మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. 

#PlayBold అనే కాన్సెప్టుతో  ఆర్సీబీ ఈ వీడియోను రూపొందించింది. ఆ జట్టు ఆటగాళ్లు విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, గ్లెన్ మ్యాక్స్వెల్, యుజ్వేంద్ర చాహల్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్ కూడా తమ డాన్స్ టాలెంట్ బయటపెట్టారు. వీరితో పాటు మహ్మద్ సిరాజ్, ఇతర ఆటగాళ్లను కూడా వీడియోలో చూడొచ్చు. 

 

ముఖ్యంగా విరాట్ కోహ్లి అయితే డాన్స్ తో ఇరగదీశాడు. ట్రెండింగ్ స్టెప్పులతో ‘నెవర్ గివ్ అప్.. డోన్ట్ బ్యాక్ డౌన్’ అంటూ  ఆడిపాడారు. ఆటగాళ్లంతా PUMA బ్రాండ్ కు షర్ట్స్,  షూస్ ధరించారు. కాగా ఈ  మ్యూజిక్ వీడియోకు ఆ జట్టు ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ కొరియోగ్రఫీ చేయడం గమనార్హం. హర్ష్ ఉపాధ్యాయ్ మ్యూజిక్ అందించాడు. 

దీనిపై ధనశ్రీ వర్మ మాట్లాడుతూ.. ‘ఆర్సీబీ క్రికెటర్లతో కలిసి  ప్టెప్పులు వేయించడం గొప్ప అనుభూతి.  క్రికెట్ ఆడేప్పుడు వాళ్లు ఫీల్డ్ లో మొత్తం ఎఫర్ట్ అంతా పెట్టి ఎలా ఆడతారో.. డాన్స్ చేసేప్పుడు కూడా అదే ఉత్సాహంతో చేశారు. ఆర్సీబీ క్రికెటర్లకే కాదు.. అందరూ ప్లేబోల్డ్ ఫిలాసఫీని తమ జీవితంలో భాగంగా మార్చుకోవాలి. ఈ జట్టు నా కుటుంబంతో సమానం. ఇక ఈ వీడియో జట్టులోని ప్రతి ఆటగాడికి, ఆర్సీబీని అభిమానించే వారికి అంకితం..’ అని తెలిపింది. 

ఇదే విషయమై ఆ జట్టు వైస్  ప్రెసిడెంట్ రాజేశ్ మీనన్ స్పందిస్తూ.. ‘ఈ వీడియో (ప్లేబోల్డ్ ఫిలాసఫీ) లో ముఖ్య ఉద్దేశం.. అవతలి వైపు ఏముందో ప్రయత్నించి తెలుసుకుంటే తప్ప అదేంటో మనం గ్రహించలేం. ఇక ఈ జట్టులో ప్రతి ఆటగాడూ ప్లేబోల్డ్ ఫిలాసఫీని నమ్ముతాడు..’ అని అన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios