దుబాయ్: ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా గత రెండు మ్యాచులకు దూరమైన విషయం తెలిసిందే. ఇలా ఐపిఎల్ కు దూరమైన రోహిత్ భార్యతో ఆనందంగా గడుపుతున్నాడు. భార్య రితికా తో  కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను రోహిత్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ''బీచ్ లో అద్భుతమైన, ప్రశాంతమైన సాయంకాలాన్ని ఆస్వాదిస్తున్నాం'' అంటూ రోహిత్ పోస్ట్ చేశాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Nice and relaxed evening at the beach 😍

A post shared by Rohit Sharma (@rohitsharma45) on Oct 27, 2020 at 9:55am PDT

 

ఇక ఐపిఎల్ లో భాగంగా ముంబై జట్టు ఆడిన గత రెండు మ్యాచ్ లకు రోహిత్ దూరంగా వున్నాడు. అలాగే ఈ గాయం నుండి కోలుకోడానికి సమయం పడుతుందని భావించిన టీమిండియా సెలెక్టర్ ఐపిఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాలో లాంగ్ టూర్ జరపనుంది. నాలుగు టెస్టులతో పాటు మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డేలు జరిగే ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ ఎందులోనూ రోహిత్ పేరును చేర్చలేదు. దీంతో అతడి గాయంపై అభిమానుల్లో మరింత ఆందోళన మొదలయ్యింది. 

అయితే రోహిత్ మాత్రం భార్యతో ఆనందంగా గడుపుతున్నాడు. అంతేకాకుండా మంగళవారం అతడు నెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్న వీడియోను ముంబై ఇండియన్స్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో దర్శనమిచ్చింది. దీంతో రోహిత్ గాయంపై అభిమానుల్లో ఆందోళన తగ్గి అనుమానం మొదలయ్యింది. గాయం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందనే రోహిత్ ను ఆసీస్ టూర్‌కి ఎంపిక చేయలేదా? లేక మరేదైనా కారణముందా? అన్నదానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు.