ఆ టైమ్‌లో టీమ్‌లో సీనియర్లు లేకపోవడం వల్లే కెఎల్ రాహుల్‌కి టెస్టు వైస్ కెప్టెన్సీ... వైస్ కెప్టెన్ ఉన్నా, లేకున్నా పెద్ద ప్రయోజనమేమీ లేదు.. కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ట్రోఫీలో టీమిండియా 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. మొదటి రెండు టెస్టుల్లో ఆసీస్ ఆటతీరు చూసిన తర్వాత ఆ టీమ్ కమ్‌బ్యాక్ ఇచ్చి మ్యాచులు గెలవడం అసాధ్యమైన పని. ఆస్ట్రేలియా, భారత స్పిన్నర్లకు పూర్తిగా సరెండర్ అయిపోవడంతో ఇప్పుడు డిస్కర్షన్ అంతా కెఎల్ రాహుల్ ఫామ్ చుట్టే తిరుగుతోంది...
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో మాత్రమే కాదు, అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ కెఎల్ రాహుల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దానికి ముందు సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రాహుల్ పెద్దగా చేసిందేమీ లేదు...
రెండేళ్ల గ్యాప్ తర్వాత అనుకోకుండా టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చి, లక్కీగా వైస్ కెప్టెన్సీ దక్కించుకున్న కెఎల్ రాహుల్, అంతే త్వరగా ఆ పొజిషన్‌ని కోల్పోయాడు. ముందు వైట్ బాల్ క్రికెట్‌లో రాహుల్ వైస్ కెప్టెన్సీని తొలగించిన టీమిండియా మేనేజ్‌మెంట్, ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో కూడా అతన్ని సైడ్ చేసేసింది...
‘టీమ్‌లో ఉన్న 17 మంది ప్లేయర్లకు వైస్ కెప్టెన్ అయ్యేందుకు అవకాశం ఉంది. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు టీమ్ ఎప్పుడూ అండగా ఉంటుంది. వైస్ కెప్టెన్సీ తీసేసినంత మాత్రాన పోయేదేమీ లేదు. వైస్ కెప్టెన్ ఉన్నా, లేకున్నా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే దాన్ని తీసేశాం.
కెఎల్ రాహుల్‌ని టెస్టు వైస్ కెప్టెన్‌గా చేసిన సమయంలో టీమ్‌లో సీనియర్ ప్లేయర్లు తక్కువగా ఉన్నారు. అందుకని అతనికి ఆ పొజిషన్ దక్కింది. ఇప్పుడు ఆ అవసరం లేదని తొలగించారు.. అదేమీ పెద్ద విషయం కాదు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మార్చి 1 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ స్టేడియంలో మూడో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా, ఆస్ట్రేలియా ఎలా ఆడతాయి అనే విషయం కంటే కెఎల్ రాహుల్‌కి తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనే విషయంపైనే ఎక్కువ సస్పెన్స్ కొనసాగుతోంది...
ఇప్పటికే బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి, కెఎల్ రాహుల్‌ని ఆడించడంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ అయితే వరుస ట్వీట్లతో కెఎల్ రాహుల్‌ని ఆటాడుకున్నాడు. మయాంక్ అగర్వాల్‌ని పక్కనబెట్టి, సర్ఫరాజ్ ఖాన్‌ని సెలక్ట్ చేయకుండా వరుసగా ఫెయిల్ అవుతున్న కెఎల్ రాహుల్‌కి ఇన్ని అవకాశాలు ఇవ్వడం వెనక ఏ కారణం ఉందో చెప్పాలంటూ వరుస ట్వీట్లతో అతని పరువు తీశాడు వెంకటేశ్ ప్రసాద్...
కెఎల్ రాహుల్‌ని ఆడించాలని సపోర్ట్ చేసినందుకు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా పరువు పోగొట్టుకున్నాడు. ఇంత రచ్చ జరిగిన తర్వాత శుబ్‌మన్ గిల్‌ని కూర్చోబెట్టి, కెఎల్ రాహుల్‌కి మరో అవకాశం ఇస్తారా? అనేది అభిమానుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇండోర్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్స్‌లో కెఎల్ రాహుల్‌తో పాటు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో మూడో టెస్టు ప్రారంభమయ్యేదాకా గిల్, రాహుల్‌లలో ఎవరు ఆడతారనేది చెప్పడం కష్టం..
