ఇంగ్లాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 578 భారీ స్కోరు అందించిన టీమిండియాకు బ్యాటింగ్‌లో ఆదిలోనే షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ 9 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.

జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. 3.3 ఓవర్లకే తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు.
శుబ్‌మన్ గిల్ 2 బౌండరీలతో తనదైన స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు.

భారత జట్టు కొత్త బంతి తీసుకోవడానికి 24 ఓవర్లు ఆలస్యం చేస్తే... ఇంగ్లాండ్ జట్టు పేస్ బౌలింగ్‌తోనే భారత జట్టును ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. 4 ఓవర్లు ముగిసేసరికి రోహిత్ శర్మ వికెట్ కోల్పోయి 20 పరుగులు చేసింది టీమిండియా.