మూడో టెస్టు కోసం రెఢీ అవుతున్న రిషబ్ పంత్...
జిమ్‌లో చెమటోడుస్తున్న యంగ్ వికెట్ కీపర్...
ఈజీగా మూడు జంప్‌లు చేసిన రిషబ్ పంత్... కెప్టెన్ లేకుంటే ఇంతేనంటూ ఇంగ్లాండ్ వుమెన్ క్రికెటర్ కామెంట్...
రెండో టెస్టులో వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా తనవంతు పాత్రను సమర్థవంతంగానే పోషించాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. వికెట్ల వెనకాల కామెంటరీతో బౌలర్లకు సలహాలు ఇస్తూనే, ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను సెడ్జింగ్ చేశాడు. మూడో టెస్టు కోసం రెఢీ అవుతున్న రిషబ్ పంత్... జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
తాజాగా జిమ్‌ల ఫ్రంట్ ఫ్లిప్ జంప్‌లు చేస్తున్న వీడియోను పోస్టు చేసిన రిషబ్ పంత్... ‘గుడ్ డే అట్ ల్యాబ్’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన ఇంగ్లాండ్ వుమెన్ క్రికెటర్ అలెగ్జాండ్రా హార్ట్‌లీ... ‘కెప్టెన్ లేనప్పుడు కుర్రాళ్లు ఇలాగే ఆడుకుంటారు... విరాట్ కోహ్లీ ఇది చేస్తే చూడాలని ఉంది’ అంటూ కామెంట్ చేసింది.
When the captains away, the boys will play...
— Alexandra Hartley (@AlexHartley93) January 5, 2021
I want to see @imVkohli do this 👏🏽👏🏽👀 https://t.co/DodxCZoKvQ
రిషబ్ పంత్ సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి జరగబోయే మూడో టెస్టులో ఎలా రాణిస్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 6, 2021, 11:18 AM IST