Asianet News TeluguAsianet News Telugu

రికీ పాంటింగ్ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు... ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కారు ఎత్తుకెళ్లి...

శుక్రవారం రాత్రి మెల్‌బోర్న్‌లోని రికీ పాంటింగ్ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు..

కారును తిరిగి స్వాధీనం చేసుకున్న పోలీసులు... అనుమానితుల కోసం గాలింపు

Ricky Ponting Car theft in Melbourne, vehicle recovered but suspects CRA
Author
India, First Published Feb 9, 2021, 11:36 AM IST

క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఒకడు. తన కెప్టెన్సీలో రెండు వన్డే ప్రపంచకప్‌లు అందించిన రికీ పాంటింగ్, ప్రస్తుతం క్రికెట్ కోచ్‌గా, కామెంటేటర్‌గా వ్యవహారిస్తున్నాడు. అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఇల్లు కలిగిన క్రికెటర్లలో ఒకడైన రికీ పాంటింగ్ కారు చోరీకి గురైంది. 

శుక్రవారం రాత్రి మెల్‌బోర్న్‌లోని రికీ పాంటింగ్ ఇంట్లోకి చొరబడ్డ కొందరు దొంగలు, కారును దొంగలించారు. కేసు స్వీకరించిన పోలీసులు, కారును రికవరీ చేసుకున్నారు. మెల్‌బోర్న్‌లోని కాంబర్‌వెల్ ఏరియాలో కారును పట్టుకున్నారు పోలీసులు. దొంగలు రికీ పాంటింగ్ కారులో నగరం మొత్తం తిరిగి, ఇక్కడ వదిలేసినట్టు గుర్తించారు.

అయితే రికీ పాంటింగ్ ఇంట్లోకి చొరబడిన దొంగల జాడ మాత్రం ఇంకా తెలియరాలేదు. అనుమానితుల కోసం ఇంకా గాలిస్తున్నట్టు తెలిపారు మెల్‌బోర్న్ పోలీసులు. రికీ పాంటింగ్ ఇంటి ఖరీదు రూ. 69.8 కోట్ల రూపాయలు. క్రికెటర్లలో అత్యంత ఖరీదైన ఇల్లు కలిగిన క్రికెటర్ పాంటింగ్.

Follow Us:
Download App:
  • android
  • ios