విరాట్ కోహ్లీ... టీమిండియాకు దొరికిన అద్భుతమైన క్రికెటర్ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే మైదానంలో అతడి ఆటతీరు ఎంత అద్భుతంగా వుంటుందో ఏదైనా తేడా వస్తే అసహసం కూడా అదే స్థాయిలో వుంటుంది. భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక మైదానంలోనే దాన్ని భయటపెడుతూ అతడు చాలాసార్లు విమర్శలపాలయ్యాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో అతడలా ప్రవర్తించగా తాజాగా ఐపిఎల్ లో కూడా అలాగే అతిగా ప్రవర్తిస్తూ సెలబ్రేషన్ చేసుకుని వార్తల్లో నిలిచాడు. 

బుధవారం బెంగళూరు-పంజాబ్ మ్యాచ్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో ఆర్సిబి 203 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ముందుంచింది. అయితే ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో చివరి ఓవర్లో పంజాబ్  కు 24 పరుగులు అవసరం పడింది. అయితే అప్పటికే పంజాబ్ బ్యాట్ మెన్స్ అందరూ పెవిలియన్ కు చేరుకోవడంతో కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ కు దిగాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో  అతడు ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాది మంచి ఊపుమీదున్నట్లు కనిపించి పంజాబ్ విజయంపై ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ తర్వాతి బంతికి భారీ సిక్సర్ బాదాలని ప్రయత్నించి బౌండరీలో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

ఆ క్యాచ్ ను అందుకున్న కోహ్లీ అతిగా సెలబ్రేషన్ చేసుకున్నాడు. కోపంగా ఏవో సైగలు చేస్తూ అశ్విన్ ను అవమానకర రీతిలో పెవిలియన్ కు పంపించాడు. అయితే కోహ్లీ ఇలా ప్రవర్తించడానికి కారణం అశ్వినే. కోహ్లీ  ఔటైన సమయంలో అశ్విన్ కూడా కాస్త ఓవర్ గా సెట్రబేట్ చేసుకున్నాడు. దీన్ని దృష్టిలో వుంచుకుని కోహ్లీ కూడా అలాగే చేశాడు.      
 
ఈ మ్యాచ్ లో చివరకు కింగ్స్ లెవెన్ పంజాబ్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఆర్సిబి మొదట బ్యాటింగ్ కు దిగి ఓపెన్ పార్థివ్ పటేల్, మిడిల్ ఆర్డర్ లో డివిలియర్స్, స్టోయినీస్ రాణించడంతో 202 పరుగుల భారీ సాధించింది. 203 పరుగుల భారీ లక్ష్య చేధనను పంజాబ్ ఓపెనర్లు కెఎల్ రాహుల్, గేల్ లు దాటిగానే  ఆరంబించారు. మిడిల్ ఆర్డర్ లో పూరన్ కూడా మెరుపు బ్యాటింగ్ చేయడంతో ఓ దశలో పంజాబ్ గెలుపు దిశగా అడుగులేసింది. అయితే ఆర్సిబి బౌలర్ సైనీ ఒకే ఓవర్లో పూరన్, మిల్లర్లను ఔట్ చేసి మ్యాచ్ ను ఆర్సిబి వైపు తిప్పాడు. చివర్లో పంజాబ్ బ్యాట్ మెన్స్ ని వరుసగా ఔటవుతూ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు మాత్రమే చేయగలిగారు.. దీంతో ఆర్సిబి 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.