టీమిండియా ప్రధాన కోచ్ మరోసారి ట్రోల్స్ బారిన పడ్డారు. ఆయన  సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెట్టడం పాపం... విపరీతంగా ట్రోల్ చేస్తారు. తాజాగా... మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేతో కలిసి దిగిన ఫోటోని రవిశాస్త్రి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే...  ఆయనను నెటిజన్లు విపరీతంగా ఏకిపారేస్తున్నారు.

ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ టెస్టు విజయం తర్వాత... రవిశాస్త్రి.. అనిల్ కుంబ్లేని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోని షేర్ చేసి... దానికి  గ్రేటెస్ట్ పర్సన్ ని కలవడం చాలా గొప్పగా ఉంది అనే క్యాప్షన్ జత చేశాడు. దానికి అనిల్ కుంబ్లేని కూడా ట్యాగ్ చేశాడు. కాగా.. రవిశాస్త్రి కన్నా ముందు టీమిండియా ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లేనే ఉన్నారు. ఆయన తర్వాత రవిశాస్త్రికి అవకాశం వచ్చింది.

కాగా.. రవిశాస్త్రి పోస్టుపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.  రవిశాస్త్రిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గ్రేటెస్ట్ పర్సన్ ని కలిశానంటూ రవిశాస్త్రి పేర్కొనడంతో.. అదే భావన ఇద్దరికీ ఉందా..? అని ఒకరు ప్రశ్నించగా... అనిల్ కుంబ్లేని ట్యాగ్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ఇంకొందరు ఫన్నీ ఎమోజీలతో స్పందించడం గమనార్హం.