ICC Rankings: ఐసీసీ నెం.1 బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్.. వారం రోజుల్లోనే టాప్ ప్లేస్‌ని కోల్పోయిన జేమ్స్ అండర్సన్! టెస్టుల్లో నెం.1 ఆల్‌రౌండర్‌గా టాప్‌లో జడ్డూ.. 

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హవా కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో జేమ్స్ అండర్సన్‌ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవడం భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి బాగా కలిసి వచ్చింది.గత వారం ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్‌గా అవతరించిన 41 ఏళ్ల జేమ్స్ అండర్సన్ రెండో స్థానానికి పడిపోయాడు..

రెండో స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ 864 పాయింట్లతో టాప్‌కి ఎగబాకాడు. గత వారం రేటింగ్స్‌లో రెండో స్థానంలో అశ్విన్‌కి, టాప్‌లో ఉన్న జేమ్స్ అండర్సన్‌కి మధ్య 2 పాయింట్ల తేడా మాత్రమే ఉండేది. అయితే న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ముగిసిన తర్వాత 7 పాయింట్లు కోల్పోవడంతో అశ్విన్ టాప్‌లోకి ఎగబాకాడు...

Scroll to load tweet…

టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ప్యాట్ కమ్మిన్స్ మూడో స్థానంలో కొనసాగుతుండగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా నాలుగో స్థానానికి ఎగబాకాడు. షాహీన్ ఆఫ్రిదీ ఐదో స్థానంలో ఉండగా రవీంద్ర జడేజా టాప్ 8లో ఉన్నాడు...

ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న జేమ్స్ అండర్సన్‌కి రవి అశ్విన్‌కి మధ్య 5 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. అయితే టెస్టుల్లో నెం.1 బౌలర్‌గా తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకోవాలంటే ఇండోర్ టెస్టులో అశ్విన్ మ్యాజిక్ చూపించాల్సి ఉంటుంది. ఈ టెస్టులో అశ్విన్ కనీసం 5 వికెట్లు తీయగలిగితే రాబోయే రోజుల్లో కూడా టాప్ ప్లేస్‌లో కొనసాగొచ్చు. లేకపోతే పాయింట్లు కోల్పోయి మళ్లీ రెండు, లేదా మూడో స్థానాలకు పడిపోవాల్సి ఉంటుంది.. 

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో సెంచరీతో చెలరేగిన జో రూట్, ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 3లోకి దూసుకొచ్చాడు. మార్నస్ లబుషేన్ టాప్‌లో కొనసాగుతుండగా స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. బాబర్ ఆజమ్ నాలుగో స్థానానికి పడిపోయాడు.

గత వారం టాప్ 6 టెస్టు బ్యాటర్‌గా ఉన్న రిషబ్ పంత్ 8వ స్థానానికి, టాప్ 7లో ఉన్న రోహిత్ శర్మ 9వ స్థానానికి పడిపోయాడరు. రవీంద్ర జడేజా 460 పాయింట్లతో టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉండగా, రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 5లో ఉన్నాడు. 

వన్డేల్లో, టీ20ల్లో నెం.1 టీమ్‌గా ఉన్న భారత జట్టు, మూడో టెస్టులో ఆస్ట్రేలియాని ఓడించగలిగితే టెస్టుల్లో కూడా టాప్ ప్లేస్‌కి ఎగబాకుతుంది. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్‌లో ఉండగా వన్డేల్లో మహ్మద్ సిరాజ్ నెం.1 బౌలర్‌గా ఉన్నాడు. టీ20ల్లో హార్ధిక్ పాండ్యా నెం.2 ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు..టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా లేకపోవడం విశేషం. 

అర్ష్‌దీప్ సింగ్ 13వ ర్యాంక్‌లో ఉండి, టీ20ల్లో టీమిండియా తరుపున బెస్ట్ ర్యాంక్ సాధించిన బౌలర్‌గా ఉన్నాడు.