ఉత్తర ప్రదేశ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదిన యంగ్ సెన్సేషనల్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్... భారీ ఆధిక్యం సాధించిన ముంబై...
యంగ్ సెన్సేషనల్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్, రంజీ ట్రోఫీ 2022 టోర్నీలో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో దూసుకుపోతున్నాడు. ఉత్తరాఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్, ఉత్తర ప్రదేశ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదాడు...
తొలి ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా డకౌట్ కాగా అర్మన్ జాఫర్ 10, సువేద్ పార్కర్ 32, సర్ఫరాజ్ ఖాన్ 40 పరుగులు చేసి అవుట్ అయ్యారు. యశస్వి జైస్వాల్ 227 బంతుల్లో 15 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి... కరణ్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. హార్దిక్ తామోర్ 233 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 115 పరుగులు చేయగా సామ్స్ ములానీ 50 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 140.4 ఓవర్లలో 393 పరుగులకి ఆలౌట్ అయ్యింది ముంబై...
ఉత్తర ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 54.3 ఓవర్లలో 180 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మాధవ్ కౌశిక్ 38, కరణ్ శర్మ 27, శివమ్ మావి 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాడే, మోహిత్ అవస్తీ, తనుష్ కోటియన్ మూడేసి వికెట్లు తీశారు...
తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన పృథ్వీ షా రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. తొలి వికెట్‌కి ఈ ఇద్దరూ కలిసి 66 పరుగులు జోడించారు. పృథ్వీ షా 71 బంతుల్లో 12 ఫోర్లతో 64 పరుగులు చేయగా, అతనితో కలిసి మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేసిన యశస్వి జైస్వాల్ మొదటి 54 బంతుల్లో సింగిల్ కూడా తీయలేదు...
54వ బంతికి సింగిల్ తీసిన యశస్వి జైస్వాల్‌ని ముంబై టీమ్‌మేట్స్ చప్పట్లతో అభినందించగా బ్యాటు ఎత్తి సింగిల్‌ని సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ యంగ్ ఓపెనర్... పృథ్వీ షా అవుటైన తర్వాత పరుగులు చేయడం మొదలెట్టిన యశస్వి జైస్వాల్ 252 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 106 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో యశస్వి జైస్వాల్‌కి ఇది హ్యాట్రిక్ సెంచరీ. వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశాడు యశస్వి జైస్వాల్...
మరో ఎండ్‌లో ఆర్మన్ జాఫర్ కూడా క్రీజులో కుదురుకుపోయి సెంచరీ దిశగా సాగుతుండడంతో 85 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 270 పరుగులు చేసింది ముంబై. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 213 పరుగుల ఆధిక్యంతో కలిపి ప్రస్తుతం 483 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది ముంబై జట్టు...
మరో నాలుగు సెషన్ల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది ముంబై. ఉత్తరప్రదేశ్ ఈ మ్యాచ్‌ని కాపాడుకుని ఫైనల్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే.
బెంగాల్ మధ్య జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు భారీ ఆధిక్యం సాధించింది. హిమాన్షు మంత్రి 165 పరుగులు, అక్షత్ రఘువంశీ 63 పరుగులు చేసి రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 341 పరుగులకి ఆలౌట్ అయ్యింది మధ్య ప్రదేశ్... మనోజ్ తివారి 102, షాబాజ్ అహ్మద్ 116 పరుగులు చేసి రాణించడంతో బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకి ఆలౌట్ అయ్యింది...
ఆదిత్య శ్రీవాస్తవ 82, రజత్ పటిదార్ 79 పరుగులు చేసి రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయే సమయానికి 251 పరుగులు చేసి... బెంగాల్‌పై 320 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకుంది మధ్యప్రదేశ్...
