ఐపిఎల్...సమ్మర్‌లో క్రికెట్ ప్రియులకు పసందైన ఎంటర్‌టైన్ మెంట్ విందును అందించే మెగా టోర్నీ. ఈ ఐపిఎల్ పేరు చెబితేనే యువతలో జోష్ పెరుగుతుంది. ఇలా ఐపిఎల్ 2019 కూడా అభిమానులకు క్రికెట్ మజాను పంచుతోంది. కేవలం బ్యాట్ మెన్స్ మెరుపులు, బౌలర్ల అద్భుతమైన బౌలింగ్, కళ్లుచెదిరే ఫీల్డింగే కాదు కొన్నిసార్లు మైదానంలో జరిగే కొన్ని సంఘటనలు అభిమానులను అలరిస్తుంటాయి. అలాంటి కామెడీ సంఘటనే సోమవారం డిల్లీ-రాజస్ధాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో చోటుచేసుకుంది. 

జైపూర్ వేదికగా సవాయి మాన్ సింగ్ స్టేడియంలో నిన్న ఆతిథ్య రాజస్థాన్-డిల్లీల మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్ జట్టు 191 పరుగులు చేసి డిల్లీ ముందు భారీ లక్ష్యాన్ని వుంచింది. ఈ క్రమంలో ఛేదనకు దిగిన డిల్లీ జట్టుకు ఓపెనర్లు ధావన్, పృథ్విషా మంచి ఆరంభాన్నివ్వగా చివర్లో రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా పంత్ దాటిగా ఆడుతున్న సమయంలో స్టువర్ట బిన్నీ, బెన్ స్టోక్స్ మిస్ ఫీల్ట్ ఆ జట్టు సభ్యులకు కోపాన్ని తెప్పించినా అభిమానులకు మాత్రం సరదాగా నవ్వుకునేలా చేసింది. 

 19 ఓవర్లో డిల్లీ బ్యాట్ మెన్ రిషబ్ పంత్ దూకుడుగా బ్యాంటింగ్ చేస్తూ ముందుకు వచ్చి మరో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే అతడి ప్రయత్నం విఫలమై బాల్ గాల్లోకి లేచింది. అయితే ఆ క్యాచ్ ఫీల్డర్లేవరూ లేనివైపు సేఫ్ గా మైదానంతో పడి బౌంండరీవైపు దూసుకెళుతుండగా రాజస్థాన్ ఫీల్డర్ స్టువర్ట్ బిన్ని అడ్డకునే ప్రయత్నం చేశాడు. అందుకోసం అతడు డైవ్ చేసిన బంతి చేతికి చిక్కకుండా జారుకుంది.  దీంతో బెన్ స్టోక్స్ ఆ బంతిని అడ్డుకుని త్రో చేసే సమయంలో అతడి చేతిలోనుండి కూడా బంతి జారి బౌండరీవైపు పరుగులు తీసింది. అయితే చివరకు స్టోక్స్ మళ్లీ దాన్ని బౌలర్ కు అందించాడు.

ఇలా వీరిద్దరు కలిసి తమ మిస్ ఫీల్డింగ్ తో జట్టు సభ్యుల కోపానికి గురైనా ప్రేక్షకులను మాత్రం కాస్సేపు నవ్వించారు. వీరి మిస్ ఫీల్డింగ్ నెటిజన్లను కూడా ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెట్ ప్రియులు దీనిపై పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ తెగ షేర్ చేస్తున్నారు.