సిడ్నీ టెస్టును వరుణుడు వదలడం లేదు. రెండో రోజు కూడా ఆటకు వర్షం అడ్డంకిగా మారింది. పలుమార్లు వర్సం అంతరాయం కలిగించడంతో మొదటి రోజు 55 ఓవర్ల పాటే ఆట సాగిన విషయం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 166/2 వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకి, లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి మంచి ఆరంభం అందించారు.

ఇద్దరూ నిలకడగా ఆడుతూ టీమిండియాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రెండో రోజు ఆట మొదలైన 11 ఓవర్లకే వర్షం అంతరాయం కలిగించింది. 70 ఓవర్లు ముగిసేసరికి లబుషేన్87 పరుగులతో, స్టీవ్ స్మత్ 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.

మొదటి రెండు టెస్టుల్లో డబుల్ డిజిట్ స్కోరు కూడా అందుకోలేకపోయిన స్మిత్, ఈ టెస్టులో అశ్విన్, జడేజా బౌలింగ్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. 196 బంతుల్లో 11 ఫోర్లతో 91 పరుగులు చేసిన లబుషేన్, జడేజా బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 206 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా.