Asianet News TeluguAsianet News Telugu

మీ తపన, పట్టుదల.. గెలుపులో కనిపించాయి: టీమిండియాపై మోడీ ప్రశంసలు

అసలు అంచనాలే లేని చోట, డ్రాగా ముగుస్తందనుకున్న మ్యాచ్‌ను టీమిండియా విజయంగా మలిచింది. దీంతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో భారత జట్టుపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. 

pm narendra modi congratulates team india for win in australia ksp
Author
New Delhi, First Published Jan 19, 2021, 3:35 PM IST

అసలు అంచనాలే లేని చోట, డ్రాగా ముగుస్తందనుకున్న మ్యాచ్‌ను టీమిండియా విజయంగా మలిచింది. దీంతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో భారత జట్టుపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

బీసీసీఐ అయితే తమ ఆటగాళ్లకు రూ.5 కోట్లు నజరానా ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్‌ చారిత్రక విజయం పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ట్విటర్‌ వేదికగా టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. 

ఆస్ట్రేలియాలో భారత క్రికెట్‌ జట్టు అద్భుత విజయం సాధించడం అత్యంత సంతోషాన్ని కలిగించిందన్నారు. ఆటగాళ్ల ఎనర్జీ, ఆట పట్ల వారికున్న తపన, పట్టుదల, గెలవాలనే సంకల్పం టోర్నీ ఆద్యంతం ప్రతిబింబించిందన్నారు. త్వరలో జరగనున్న టోర్నీల్లోనూ మరిన్ని విజయాలు సాధించాలని మోడీ ఆకాంక్షించారు.

అటు భారత జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలియజేశారు. కీలక ఆటగాళ్లు గాయాల బారినపడినా వున్న కాస్త వనరులతోనే టీమిండియా అద్భుతం చేసిందని ప్రశంసించారు.

ఈ విజయం ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. అటు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కూడా భారత జట్టును ప్రశంసించారు. భారత జట్టు తమను గర్వపడేలా చేసిందని... ఇది చరిత్రలో నిలిచిపోయే విజయంగా కేటీఆర్ అభివర్ణించారు. కొత్త ఏడాదిని అద్భుతంగా ప్రారంభించారని తారక రామారావు వ్యాఖ్యానించారు. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios