Asianet News TeluguAsianet News Telugu

క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్న పైలెట్...!

టీవీ చూసే వీలు లేకపోతే.. కనీసం లైవ్ అప్ డేట్స్ అయినా తెలుసుకుంటారు. కానీ... ఓ క్రికెట్ అభిమానికి తన ఫేవరేట్ టీమ్ మ్యాచ్ రోజున ప్రయాణం చేయాల్సి వచ్చింది.

Pilot sends India vs South Africa score update to passenger onboard flight
Author
First Published Nov 1, 2022, 10:13 AM IST

క్రికెట్ ని పెద్దగా ఫాలో అవ్వని వారిని కాసేపు పక్కన పెడితే.... క్రికెట్ అంటే పడిచచ్చిపోయేవారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా వరల్డ్ కప్ , ఐపీఎల్ వంటి సందర్భాల్లో ఈ క్రికెట్ ఫీవర్ మరింత ఎక్కువగా ఉంటుంది తమ అభిమాన జట్టు మ్యాచ్ ఉంది అంటే.. ఆ రోజు టీవీలకు అతుక్కుపోవాల్సిందే.  టీవీ చూసే వీలు లేకపోతే.. కనీసం లైవ్ అప్ డేట్స్ అయినా తెలుసుకుంటారు. కానీ... ఓ క్రికెట్ అభిమానికి తన ఫేవరేట్ టీమ్ మ్యాచ్ రోజున ప్రయాణం చేయాల్సి వచ్చింది. అందుకే... క్రికెట్ అప్ డేట్ కోసం పైలెట్ ని అడిగాడు. అతను అడగగానే.. సదరు పైలెట్ కూడా ఏమీ అనకుండా.. లైవ్ అప్ డేట్స్ కనుక్కొని స్కోర్ తెలియజేశాడు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజంగా జరిగింది.

 


విక్రమ్ గార్గా అనే ట్విటర్ యూజర్ టిష్యూ పేపర్‌తో కూడిన పోస్ట్‌ను షేర్ చేశారు. అది అతనికి మామూలు టిష్యూ పేపర్ కాదు. ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో స్కోర్ అప్‌డేట్‌ను అందులో పొందుపరిచారు. విమానంలో గాలిలో ఉన్న సమయంలో తాను స్కోర్ కావాలని పైలెట్ ని అడిగినప్పుడు.. ఇలా చెప్పాడంటూ అతను సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. 

"ఈరోజు భారతదేశం ఓడిపోయింది కానీ @IndiGo6E నా హృదయాన్ని గెలుచుకుంది. స్కోర్ అప్‌డేట్ కోసం అభ్యర్థించినప్పుడు పైలట్ మిడ్ ఎయిర్ నోట్‌ని పంపారు. #momentsthatmatter," అంటూ షేర్ చేశాడు.

ఇంకేముంది ఈ పోస్టు అభిమానులు, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ట్వీట్ కి విశేషమైన స్పందన లభిచింది.

Follow Us:
Download App:
  • android
  • ios