Asianet News TeluguAsianet News Telugu

బై! బై పాకిస్తాన్.. పాకిస్తాన్ జిందా‘బాగ్’! వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ వైరల్...

సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న పాకిస్తాన్.. క్షేమంగా పాకిస్తాన్‌కి తిరిగి వెళ్లండి అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్... 

Pakistan Zindabhag, Virender Sehwag tweets on Pakistan exit goes viral, ICC World cup 2023 CRA
Author
First Published Nov 10, 2023, 1:57 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలు ఆవిరి అయిపోయాయి. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 242 పరుగుల తేడాతో గెలిస్తే, పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పాకిస్తాన్ తొలుత ఫీల్డింగ్ చేయాల్సి వస్తే మాత్రం, సెమీస్ చేరాలంటే ఇంగ్లాండ్ విధించిన లక్ష్యాన్ని 2.4 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది..

ఈ రెండు సాధ్యమయ్యేవి కావు కాబట్టి పాకిస్తాన్, సెమీస్ రేసు నుంచి తప్పుకున్నట్టే. లక్కీగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వర్షం రావడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గెలిచింది పాకిస్తాన్. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వర్షం వచ్చి మ్యాచ్ రద్దు అయినా, పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశం ఉండదు..

దీంతో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌పై వ్యంగ్యంగా ట్వీట్లు చేశాడు. ‘పాకిస్తాన్ జిందాబాగ్! క్షేమంగా స్వదేశానికి తిరిగి వెళ్లండి.’ అంటూ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్..

‘పాకిస్తాన్‌ని దరిద్రం వెంటాడుతున్నట్టుగా ఉంది. అందుకే పాక్ ఏ టీమ్‌ని సపోర్ట్ చేసినా, ఆ టీమ్ కూడా పాకిస్తాన్ లాగానే ఆడుతుంది. సారీ శ్రీలంక..’ అంటూ మరో ట్వీట్ చేశాడు వీరూ.. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..  

Follow Us:
Download App:
  • android
  • ios