Asianet News TeluguAsianet News Telugu

టాస్ ఓడిందా, సెమీస్ నుంచి అవుట్! టాస్ గెలిచినా 500 కొడితేనే... పాకిస్తాన్‌కి వింత పరిస్థితి...

పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 273 పరుగుల తేడాతో గెలిస్తేనే సెమీస్ చేరే ఛాన్స్... తొలుత బౌలింగ్ చేయాల్సి వస్తే, సెమీస్ రేసు నుంచి తప్పుకున్నట్టే.. 

Pakistan qualification scenario for Semi Finals, India vs New Zealand confirmed CRA
Author
First Published Nov 9, 2023, 8:58 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి 2 మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత వరుస విజయాలతో సెమీ ఫైనల్ చేరింది. మరో వైపు మొదటి 2 మ్యాచుల్లో గెలిచిన పాకిస్తాన్, వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది..

లక్ కలిసి వచ్చి, వరుణుడు కరుణించి న్యూజిలాండ్‌‌పై గెలిచినా సెమీస్ చేరేందుకు సరిపోలేదు. న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలవడంతో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపు ఆవిరైపోయాయి..

శనివారం, నవంబర్ 11న కోల్‌కత్తాలో ఇంగ్లాండ్, పాకిస్తాన మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎంత అద్బుతం చేసినా, సెమీస్ చేరే ఛాన్స్ లేదు. 

పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తే 300+ పరుగులు చేయగలిగితే, ఇంగ్లాండ్‌ని 13 పరుగులకే ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. ఇది అసాధ్యం. ఓటమి అంతరం 273+ ఉంటే, న్యూజిలండ్ నెట్ రన్ రేట్‌ని అధిగమించగలుగుతుంది 

400+ పరుగులు చేస్తే, ఇంగ్లాండ్‌ని 112 పరుగులకి ఆలౌట్ చేయాలి. 500+ పరుగులు చేస్తే, ఇంగ్లాండ్‌ని 211 పరుగులకి నియంత్రించగలగాలి. అంటే పాకిస్తాన్, ఇంగ్లాండ్‌పై 10+ రన్ రేట్‌తో పరుగులు చేయాల్సి ఉంటుంది..

ఒకవేళ పాకిస్తాన్ టాస్ ఓడి, తొలుత బౌలింగ్ చేయాల్సి వస్తే, సెమీ ఫైనల్ చేరే ఛాన్స్ ఉండదు..  ఎందుకంటే ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే, 100 పరుగులు చేసినా.. ఆ లక్ష్యాన్ని 2.3 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. ఇది వీలయ్యే అవకాశం లేదు. కాబట్టి నామమాత్రానికి పాకిస్తాన్‌కి సెమీస్ అవకాశాలు ఉన్నా, రియాలిటీలో అవి ఉన్నా లేనట్టే..

Follow Us:
Download App:
  • android
  • ios