2019 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టే ఫేవరేట్ అన్నాడు ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. ఈసారి ప్రపంచకప్ గెలిచే జట్లు ఇండియా, ఇంగ్లాండేనని మాజీలు, విశ్లేషకులు అంటున్నారని.. కానీ మా జట్టుకే ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలున్నాయని ధీమా వ్యక్తం చేశాడు.

పాక్ జట్టుపై ఎవరికీ ఎటువంటి అంచనాలు లేవు కాబట్టి జట్టుపై ఎలాంటి ఒత్తిడి ఉండదని పేర్కొన్నాడు. భారీ అంచనాలతో టోర్నీలోకి అడుగుపెడితే తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని అది ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.

తద్వారా 2019 ప్రపంచకప్‌లో భారత్ కంటే పాకిస్తాన్ జట్టే హాట్ ఫేవరేట్ అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఏ ప్రపంచకప్‌లోనూ భారత్‌పై పాక్ విజయం సాధించలేదని.. అయితే ఈసారి ఇండియాతో జరిగే మ్యాచ్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నాడు.

టోర్నీలో ఎదుర్కొనే 9 మ్యాచ్‌లు చాలా ముఖ్యమైనవనిగా అభివర్ణించాడు. ఏ జట్టుతో తలపడినా అది భారతజట్టుతో ఆడినట్లుగానే భావిస్తామని పాక్ కెప్టెన్ స్పష్టం చేశాడు.