Asia Cup 2025 Pakistan vs Oman : దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 నాలుగో మ్యాచ్‌లో పాకిస్తాన్ 93 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించి బలమైన ఆరంభం చేసింది. తన తర్వాతి మ్యాచ్ లో భారత్ తో తలపడనుంది.

Pakistan vs Oman : ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఒమన్‌పై 93 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా బ్యాటింగ్ ఎంచుకున్నారు.

పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ హారిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఆయన 43 బంతుల్లో 66 పరుగులు చేశారు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. సహిబ్జాదా ఫర్హాన్ 29 పరుగులు, ఫఖర్ జమాన్ 23 పరుగులు చేసి సహకరించారు.

అయితే మిడిల్ లో పాకిస్తాన్ పెద్దగా రాణించలేకపోయింది. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. ఒమన్ బౌలర్లు అమిర్ కలీం, షా ఫైసల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇద్దరూ చెరో 3 వికెట్లు తీశారు.

Scroll to load tweet…

ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయిన ఒమన్

161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ బ్యాటింగ్ ప్రభావం చూపించలేకపోయింది. వరుస వికెట్లు కోల్పోయి త్వరగా కుప్పకూలింది. పాకిస్థాన్ బౌలర్లు ఖచ్చితమైన ప్రదర్శన చూపించారు. కేవలం 8.5 ఓవర్లలో 49/6 వద్ద ఒమన్ కష్టాల్లో పడింది.

సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్ లాంటి స్పిన్నర్లు బలమైన బౌలింగ్ చేసి ఒమన్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. చివరికి ఒమాన్ 67 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాకిస్థాన్‌కు 93 పరుగుల తేడాతో ఘన విజయం లభించింది.

పాకిస్తాన్ vs ఒమన్ మ్యాచ్ హైలెట్స్

• మ్యాచ్ ఫలితం: పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో విజయం

• వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం

• టాస్: పాకిస్తాన్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది

• పాకిస్తాన్ స్కోరు: 160/7 (20 ఓవర్లు)

• ఒమన్ స్కోరు: 67 ఆలౌట (లక్ష్యం 161)

• ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : మొహమ్మద్ హారిస్ (66 పరుగులు, 43 బంతుల్లో)

ఒమన్ కు చారిత్రాత్మక సందర్భం

ఈ మ్యాచ్ ఒమాన్‌కు ఆసియా కప్‌లో తొలి ప్రదర్శన. అలాగే పాకిస్థాన్‌తో వారి తొలి T20I మ్యాచ్ కావడం కూడా విశేషం. టోర్నమెంట్‌లో ఆరంభ విజయంతో పాకిస్థాన్ జట్టు ఇప్పుడు భారత్‌తో జరిగే తర్వాతి మ్యాచ్ కు సిద్ధమవుతోంది.