Imad Wasim : వీడ్కోలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.. రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ ఆల్‌రౌండర్..

Imad Wasim : పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఆటగాడు ఇమాద్ వసీమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023 జట్టులో తనకు చోటు దక్కించుకోలేకపోవడంతో ఇమాద్ వసీం వీడ్కోలు పలికాడు. ఇమాద్ వసీం చాలా కాలంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతను నవంబర్ 2020లో జింబాబ్వేపై పాకిస్తాన్ తరపున తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు.

Pakistan All-Rounder Imad Wasim Announced Retirement From International Cricket KRJ

Imad Wasim :పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఆటగాడు ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 34 ఏళ్ల ఇమాద్ అన్ని ఫార్మట్లకు శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే ప్రపంచకప్ 2023 జట్టులో తనకు చోటు దక్కించుకోలేకపోవడంతో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

వాస్తవానికి ఇమాద్ వసీంకి చాలా కాలంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతను తన తన చివరి వన్డే మ్యాచ్ ను నవంబర్ 2020లో జింబాబ్వేపై ఆడాడు. వసీం చివరిగా 2023 ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన T20 ఇంటర్నేషనల్‌ టీ20 మ్యాచ్‌లో ఆడాడు. ఈ పాకిస్థాన్ ఆల్ రౌండర్ తన కెరీర్‌లో 55 వన్డేలు, 66 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 109 వికెట్లు తీసి 1472 పరుగులు చేశాడు.

రిటైరయ్యేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానని ఇమాద్ సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. "ఇటీవలి కాలంలో నా అంతర్జాతీయ కెరీర్ గురించి చాలా ఆలోచిస్తున్నానని, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇదే సరైన సమయమని నిర్ణయానికి వచ్చానని చెప్పాడు. పిసిబి అందించిన మద్దతుకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వకారణం. వన్డే, టీ20ల్లో నేను ఆడిన 121 మ్యాచ్‌ల్లో ప్రతి ఒక్కటీ ఒక కల" అని పోస్ట్‌లో రాశాడు.

కొత్త కోచ్, జట్టు నాయకత్వం రాకతో పాకిస్థాన్ క్రికెట్‌కు ఇది గొప్ప సమయం. అందరికీ జట్టులో అవకాశం రావాలని కోరుకుంటున్నాను. జట్టు అద్భుతంగా రాణిస్తుందని ఆశిస్తున్నాను.  తన కెరీర్‌లో తనకు మద్దతుగా నిలిచిన పాక్ అభిమానులతో పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు పాక్ క్రికెటర్ కృతజ్ఞతలు తెలిపాడు ఇమాద్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios