అంతేకాదు, బ్యాంటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయడం, కపిల్ దేవ్ కామెంట్స్ పై తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పందించారు. 


వెస్టిండీస్ జట్టుపై భారత్ రెండో వన్డేలో ఓడిపోయింది. అనవసర ప్రయోగాలతో టీమిండియా పరాభవానికి గురైంది. తొలి మ్యాచ్‌లోనే టీమిండియాలో లోపాలు కనిపించాయి. రెండో వన్డేకైనా వాటిని సరిపుచ్చుకోకుండా అలాగే ఎక్స్‌పెరిమెంట్ చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్‌మెన్ విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇవ్వడం వల్ల జట్టుకి తీవ్ర నష్టం జరిగింది. కాగా, ప్రస్తుతం మూడో వన్డే కోసం సిద్ధమైంది. ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా రాత్రి 7గంటలకు ( ఇండియన్ టైమ్ ప్రకారం) ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ వన్డే సిరీస్ లో టీమిండియా చాలా ప్రయోగాలు చేసింది. ఈ ప్రయోగాలు చేసినా మొదటి మ్యాచ్ లో విజయం సాధించినా, రెండో మ్యాచ్ లో బోల్తా కొట్టింది. దీంతో, ఈ మూడో వన్డే మ్యాచ్ ఏం చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, బ్యాంటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయడం, కపిల్ దేవ్ కామెంట్స్ పై తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పందించారు.

ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ కి ముందు తాము ఆడే చివరి వన్డే సిరీస్ ఇదేనని ఆయన అన్నారు. అందుకే తాము ఈ వన్డే సిరీస్ లో ప్రయోగాలు చేశామని చెప్పారు. బ్యాటింగ్, బౌలింగ్ లో చాలా మార్పులు చేశామని చెప్పారు. మెగా టోర్నీలో ఇలాంటి మార్పులు చేసే అవకాశం ఉండదని, అందుకే ఇపపుడు చేసినట్లు తెలిపారు. ఇక, రెండో వన్డేలో ఇద్దరు సీనియర్స్ లేకుండా బరిలోకి దిగామని, ఫలితం అనుకులంగా రాకపోయినా, మార్పులు చేయాలని అనుకున్నామని చెప్పారు.

ఇలా మార్పులు చేయడం వల్ల మ్యాచ్ ఓడిపోయినా నష్టం లేదని, తర్వాత జరిగే మెగా టోర్నీలో ఏ కాంబినేషన్ బాగా సెట్అవుతుందో ఓ క్లారిటీ వస్తుందని చెప్పారు. ఈ విషయంలో ఎప్పుడు ఏం చేయాలో మేనేజ్మెంట్, కెప్టెన్ కి బాగా తెలుసు అని ఆయన అన్నారు. 

ఇక, ప్రస్తుత భారత ఆటగాళ్లకు డబ్బు, అహంకారం పెరిగిపోయిందని తమకు అన్నీ తెలుసనే భావనలో ఉంటారని ఇటీవల కపిల్ దేవ్ చేసిన ఆరోపణలపై కూడా జడ్డూ స్పందించారు. కపిల్ దేవ్ ఆ వ్యాఖ్యలు ఎప్పుడు చేశాడో కూడా తనకు తెలీదని చెప్పారు. తాను ఇలాంటి విషయాలను సోషల్ మీడియాలో సెర్చ్ చేయనన్నారు. ప్రతి ఒక్కరికి వారి స్వంత అభిప్రాయం ఉంటుందని, అలాగే కపిల్ దేవ్‌కు కూడా ఆయన అభిప్రాయన్ని పంచుకోవడానికి పూర్తి హక్కు ఉందని అభిప్రాయపడ్డారు.

 కానీ ఆయన చెప్పినట్టుగా టీమిండియా ఆటగాళ్లలో ఎలాంటి అహంకారం, గర్వం లేదు అని క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నారని, . ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్నారన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా 100 శాతం ఎఫెక్టు పెట్టి టీమిండియాను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఓడిపోయినప్పుడు విమర్శలు రావడం సహజమని ఈ టాపిక్ కి పులిస్టాప్ పెట్టడం విశేషం.