Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లండుపై భారత్ విజయం: ‘ఓ మై లార్డ్స్’.. హోరెత్తుతున్న ట్విట్టర్..!

జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ లు అదరగొట్టారు. దీంతో.. వీరిపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విజయంపై ఇప్పుడు ట్విట్టర్ లో ట్వీట్స్ ఇప్పుడు హోరెత్తుతున్నాయి.

Oh my lords..tweets in Twitter About India Historic win
Author
Hyderabad, First Published Aug 17, 2021, 10:04 AM IST

లండన్ లోని లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. ముఖ్యంగా ఆఖరిరోజు మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. దాదాపు 151 పరుగుల తేడాతో.. టీమిండియాకు విజయం సొంతమైంది.  ఈ మ్యాచ్ గెలిచి సీరిస్ లో 1-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. అందరూ మ్యాచ్ డ్రా అవుతుంది లేదంటే.. ఇంగ్లాండ్ వశం అవుతుందని అనుకున్నారు. టీమిండియా మ్యాచ్ కూడా అలానే ఆడింది. సోమవారం ఓవర్ నైట్ స్కోర్ 181/6 తో రెండో ఇన్నింగ్స్ ని భారత్ కొనసాగించింది.. దీంతో.. దానిని చేధించడానికి ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు తిప్పలు పడాల్సి వచ్చింది. చివరకు.. విజయం భారత్ కే దక్కింది.

జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ లు అదరగొట్టారు. దీంతో.. వీరిపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విజయంపై ఇప్పుడు ట్విట్టర్ లో ట్వీట్స్ ఇప్పుడు హోరెత్తుతున్నాయి.

ఈ విజయంపై సచిన్ కూడా ట్వీట్ చేశారు.‘ టెస్టు మ్యాచ్ అంటే ఇది’ అంటూ సచిన్ ట్వీట్ చేశారు. 

 

‘మ్యాచ్ మొదటి రోజు అసలు వీరు నిలదొక్కుకోగలుగుతారా లేదా అనుకున్నాం. కానీ చివరి రోజు విజయం సాధించారు. కుర్రాళ్లు అదరగొట్టారు. భారతీయులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

కేవలం వీరు మాత్రమే కాదు.. ప్రస్తుతం ట్విట్టర్ లో ఎక్కడ చూసినా.. ఈ మ్యాచ్ కి సంబంధించిన ట్వీట్వే కావడం గమనార్హం. టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వసీమ్ జాఫర్ చేసిన ట్వీట్ మాత్రం అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.

‘ ఆగస్టు 15కి బ్రిటీష్ వారికి ఏమైనా నేర్పిస్తే...  ఆగస్టు 15 తర్వాత.. ఇండియన్స్ ఎప్పుడూ కలవరపడరు’ అంటూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేయడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios