క్రైస్ట్ చర్చ్: ఎడమ కాలి పాదం ఉబ్బడంతో పృథ్వీషా గురువారం ప్రాక్టీస్ సెషన్ కు దూరమయ్యాడు. రెండో టెస్టు మ్యాచు శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇండియాకు చిక్కులు ఎదురవుతున్నాయి. గురువారం పృథ్వీషాకు రక్తపరీక్షలు జరిగే అవకాశం ఉంది. పాదం ఉబ్బడానికి గల కారణాలేమిటో పరీక్షల్లో తేలనుంది. 

వైద్య పరీక్షలు సానుకూలంగా వస్తే శుక్రవారం పృథ్వీ షా ప్రాక్టీస్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ స్థితిలో పృథ్వీ షా రెండో టెస్టు మ్యాచుకు అందుబాటులో ఉంటాడా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను దూరమైతే తుది జట్టులోకి శుభ్ మన్ గిల్ ను తీసుకునే అవకాశం ఉంది. గురువారం అతను ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. 

మయాంక్ అగర్వాల్ తో కలిసి శుభ్ మన్ గిల్ ఇన్నింగ్సును ప్రారంభించే అవకాశం ఉంది. శుభ్ మన్ గిల్ ప్రాక్టీస్ పై టీమిండియా హెడ్ కోచ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. రవిశాస్త్రి గిల్ వద్దకు వెళ్లి ఫుట్ వర్క్ పై సలహా ఇవ్వడం కనిపించింది. 

పృథ్వీ షా పాదం ఉబ్బిన సంఘటన అంత తీవ్రమైంది కాదని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. వెల్గింగ్టన్ లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్సుల్లోనూ పృథ్వీ షా చాలా చెత్తగా అవుటయ్యాడు.