NZ vs AUS : నాథన్ లియోన్ దెబ్బ‌కు కుప్ప‌కూలిన న్యూజిలాండ్.. వెల్లింగ్టన్‌లో ఆసీస్ ఆధిక్యం

New Zealand vs Australia : వెల్లింగ్టన్‌లో జరుగుతున్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో కీవీస్ 179 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్ అద్భుత బౌలింగ్ తో బ్లాక్ క్యాప్స్ టీమ్ ను దెబ్బతీశాడు. 
 

NZ vs AUS: New Zealand collapses to Nathan Lyon's blow,  Australia lead wellington Test RMA

New Zealand vs Australia - Nathan Lyon : వెల్లింగ్టన్‌లో జరుగుతున్న న్యూజిలాండ్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో నాథన్ లియాన్ అద్భుత బౌలింగ్ తో న్యూజిలాండ్ ను దెబ్బ‌తీశాడు. ఈ వెటరన్ ఆస్ట్రేలియన్ ఆఫ్ స్పిన్నర్ న్యూజిలాండ్ టీమ్ లోని కీల‌క‌మైన న‌లుగురు ప్లేయ‌ర్ల ఔట్ చేసి  179 ప‌రుగుల‌కే కీవీస్ ను క‌ట్ట‌డి చేశాడు. 8.1 ఓవర్ల త‌న బౌలింగ్ లో 4/43 వికెట్ల‌తో విజృంభించాడు. దీంతో వెస్టిండీస్ లెజెండ్ కోర్ట్నీ వాల్ష్‌ను దాటి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఏడవ బౌలర్‌గా ఘ‌త‌న సాధించాడు. ఈ మ్యాచ్ లో 84 పరుగుల కీవీస్ భాగస్వామ్యాన్ని విడదీస్తూ  టామ్ బ్లండెల్ (33) ను తొలి వికెట్ గా ఔట్ చేశాడు. మ‌రో రెండు బంతుల త‌ర్వాత స్కాట్ కుగ్గెలీజిన్‌ను డకౌట్‌గా పెవిలియ‌న్ కు పంపాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న మాట్ హెన్రీ (42) కూడా ఔట్ చేసి న్యూజిలాండ్ ను కోలుకోలేని విధంగా దెబ్బ‌కొట్టాడు. కెప్టెన్ టిమ్ సౌథీ (1) వికెట్ కూడా లియోన్‌కు తీసుకున్నాడు. 

ఈ క్ర‌మంలోనే నాథ‌న్ లియాన్ వెస్టిండీస్ స్టార్ బౌల‌ర్ వాల్ష్‌ను అధిగ‌మించాడు. ఇప్ప‌టివ‌ర‌కు లియాన్ 128 టెస్టుల్లో 30.58 సగటుతో 521 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23 సార్లు ఐదు వికెట్లు, 4 సార్లు 10 వికెట్లు తీసుకున్నాడు. అత్య‌ధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియా దిగ్గ‌జ బౌల‌ర్లు షేన్ వార్న్ (708), గ్లెన్ మెక్‌గ్రాత్ (563)ల‌తో కూడిన‌ 500 వికెట్ల క్లబ్‌లో  లియాన్ చేరాడు. ఈ మ్యాచ్ లో తన మూడో వికెట్‌తో లియాన్ వాల్ష్ (519)ను అధిగమించి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఏడవ బౌలర్‌గా నిలిచాడు. ప్ర‌స్తుతం శ్రీలంక క్రికెట్ దిగ్గ‌జం ఆఫ్ స్పిన్నర్లలో ముత్తయ్య మురళీధరన్ (800) అత్య‌ధిక టెస్టు వికెట్లు తీసిన బౌల‌ర్ గా టాప్ లో ఉన్నారు.

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు సాధించిన టాప్-5 భార‌త క్రికెట‌ర్లు వీరే !

 

న్యూజిలాండ్‌పై 54వ వికెట్.. 

న్యూజిలాండ్ పై 11వ టెస్టు ఆడుతున్న నాథ‌న్ లియాన్ 19.79 సగటుతో 54 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ (14.31)పై మాత్రమే ఆఫ్ స్పిన్నర్ మెరుగైన సగటును కలిగి ఉన్నాడు. 2 సార్లు న్యూజిలాండ్ పై 5 వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్ గ‌డ్డ‌పై మూడు టెస్టుల్లో 19.21 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా వుండ‌గా, ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కు ఇప్ప‌టికే 200+ అధిక్యం ల‌భించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 383 ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ అజేయంగా 174 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ ఐదు వికెట్లు తీశాడు. కీవీస్ తొలి ఇన్నింగ్స్ లో 179 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, గ్లెన్ ఫిలిప్స్ 71 పరుగులు, హెన్రీ 42 ప‌రుగుల‌తో రాణించారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 13/2 ప‌రుగుల‌తో రెండో రోజు ఆట‌ను ముగించింది. ఆస్ట్రేలియా ఇప్ప‌టికే 217 పరుగుల ఆధిక్యం ల‌భించింది.

అయ్యో కేన్ మామ ఇలా ఔట‌య్యావేంది.. ! 12 ఏండ్ల‌లో ఇదే తొలిసారి.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios