400 పరుగుల రికార్డును బ్రేక్ చేసేది శుభ్‌మన్ గిల్ నే.. బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు
Brian Lara comments on Shubhman Gill: టెస్టులు, వన్డేల్లో 22 వేలకు పైగా పరుగులు చేసిన బ్రియాన్ లారా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరు. అతను చేసిన పరుగులతో పాటు, లారా రెడ్ బాల్ క్రికెట్లో 400*, 501* పరుగులతో సుదీర్ఘ ఇన్నింగ్స్ లతో రికార్డు సృష్టించారు.
Brian Lara: సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 1958లో టెస్ట్ క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ లో 365* పరుగులు చేసినప్పుడు క్రికెట్ ప్రపంచ మొత్తం ఆశ్చర్చ పోయింది. ఈ రికార్డును ఎవరైనా బద్దలు కొట్టగలరా? అనే ప్రశ్నల సమయంలో బ్రియాన్ లారా 36 సంవత్సరాల తరువాత 1994 లో ఇంగ్లాండ్ పై 375 పరుగులు చేశాడు. ఈ తర్వాతి రెండు నెలల్లోనే ఇంగ్లాండ్ పై కౌంటీ ఛాంపియన్ షిప్ లో ఏకంగా 501* పరుగులు చేశాడు. ఇక పదేళ్ల తర్వాత టెస్టు క్రికెట్ లో 400 పరుగులు కూడా సాధించాడు. టెస్టులు, వన్డేల్లో 22 వేలకు పైగా పరుగులు చేసిన బ్రియాన్ లారా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరు. అతను చేసిన పరుగులతో పాటు, లారా రెడ్ బాల్ క్రికెట్లో 400*, 501* పరుగులతో సుదీర్ఘ ఇన్నింగ్స్ లతో రికార్డు సృష్టించారు.
అయితే, బ్రియాన్ లారా తన రికార్డులను బద్దలుకొట్టే ఆటగాళ్ల గురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దూకుడు క్రికెట్ పేరొందిన, ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన ఆటగాళ్లు కాకుండా ఇప్పుడే క్రికెట్ లో స్టార్ గా ఎదుగుతున్న ఒక కొత్త భారత ఆటగాడు తన రికార్డులను బద్దలు కొడతాడని లారా పేర్కొన్నాడు. అతనే శుభ్‌మన్ గిల్. "నా రెండు రికార్డులను అధిగమించే సత్తా శుభ్‌మన్ గిల్‌కు ఉంది. గిల్ ఈ కొత్త తరంలో అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్లలో ఒకడు. అతను రాబోయే సంవత్సరాల్లో క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రికెట్ ను శాసించడమే కాకుండా అతను తన కెరీర్‌లో అనేక ముఖ్యమైన రికార్డులను నెలకొల్పుతాడనీ, నా రికార్డులను బ్రేక్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది" అని క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నారు.
అలాగే, "శుభ్‌మన్ గిల్ కౌంటీ క్రికెట్ ఆడితే నా 501* పరుగుల రికార్డును బద్దలు కొట్టగలడు. టెస్టు క్రికెట్ లో కచ్చితంగా 400 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడు. ఎందుకంటే బ్యాటింగ్ లో క్రికెట్ చాలా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ లు పెరుగుతున్నాయి. అందరూ ఇందులో ఆడుతున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ అన్నిటినీ మార్చేసింది. స్కోరింగ్ రేటు పెరిగింది. కాబట్టి మీరు పెద్ద స్కోర్లను చూస్తూనే ఉంటారు. శుభ్ మన్ గిల్ భారీ స్కోర్ చేస్తాడు.. నా మాటలను మార్క్ చేయండి' అని లారా పేర్కొన్నాడు.