మానవత్వం చూపించాల్సిన సమయం ఇదంటూ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో యూవీ ఇలా పేర్కొన్నారు. దేశంలో రోజు రోజుకీ కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కేసులు పెరుగుతునే ఉన్నాయి. శుక్రవారం నాటికి దేశంలో మొత్తంగా  1,73,763 కేసులు నమోదైనట్టు అధికారులు చెప్పారు.

గత 24 గంటల్లో 8వేలకు పైగా కేసులు నమోదయినట్టు అధికారులు చెప్పారు. 

ఇప్పటివరకు 82,369మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా 4,971 మంది మరణించారని తెలియవస్తుంది.  ఒక్కరోజే  మంది 200 మందికి పైగా ఈ కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం 89,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రోజు రోజుకీ పెరిగిపోతున్న కేసులు ప్రజల్లో భయాందోళలను రెట్టింపు చేస్తున్నాయి. కాగా.. ఈ కరోనా వైరస్ కేసులపై తాజాగా యూవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘గత 24 గంటల్లో ఇండియా 7వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. భౌతిక దూరం పాటించండి. కష్టాల్లో ఉన్నవారికి అందరం అండగా నిలుద్దాం. మానవత్వం చూపించేందుకు ఇదే సరైన సమయం’’ అంటూ యువరాజ్ ట్వీట్ చేశాడు.

ఇదిలా ఉండగా.. కరోనాపై పోరులో భాగంగా యువరాజ్ సింగ్ భారీ విరాళం ప్రకటించారు. ఈ విషయంలో గతంలో ఆయనే స్వయంగా వెల్లడించారు. పీఎం కేర్స్‌కు రూ.50 లక్షలు సాయంగా అందిస్తున్నానని, మీరు కూడా వీలైనంత సాయం చేయండి అంటూ అభిమానులతో యువరాజ్ పేర్కొన్నాడు. 

కాగా.. యువరాజ్ సింగ్ బాలీవుడ్ నటి హిచెల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం గర్భవతి. దీంతో.. తాను త్వరలోనే తండ్రిని కాబోతున్నానంటూ ఇటీవల యూవీ పేర్కొన్నాడు.