1983లో తొలిసారి క్రికెట్ ప్రపంచకప్‌ సాధించిన తర్వాత మళ్లీ వరల్డ్ కప్‌ను పొందడానికి టీమిండియాకు మూడు దశాబ్ధాలు పట్టింది. సరిగ్గా తొమ్మిదేళ్ల కిందట.. ఏప్రిల్ 2, 2011న మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.

ముంబై వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్‌ 6 వికెట్లతో విజయం సాధించింది. దీంతో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ కలను నెరవేర్చింది. ఈ మ్యాచ్‌లో మిస్టర్ కూల్ ధోనీ సిక్సర్‌తో ఫినిషింగ్ షాట్ కొట్టిన దృశ్యం ఇంకా భారత క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది.

అలాగే సొంత గడ్డపై వరల్డ్‌కప్‌ను అందుకున్న తొలి దేశంగా భారత్ రికార్డుల్లోకి ఎక్కింది. గౌతం గంభీర్ 91, ధోనీ 91 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత విజయాన్ని పురస్కరించుకుని ఓ క్రికెట్ వెబ్‌సైట్ నాటి విజయంపై ట్వీట్ చేసింది.

అయితే దీనిపై స్పందించారు టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ స్పందించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ అంతా కలిసి సాధించింది. ముఖ్యంగా టీమిండియా, సహాయక సిబ్బంది వల్లేనని గుర్తు చేసింది.

ముఖ్యంగా ధోనీ పాత్ర కంటే కూడా సమిష్టి ఆట తీరువల్లే భారత జట్టు వరల్డ్‌కప్‌ను సాధించిందని పేర్కొన్నాడు. అయితే ఈ పోస్ట్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఎంఎస్‌ ధోనీ సిక్సర్ కొడుతున్న షాట్‌ను పోస్ట్ చేసి, గంభీర్ చాలా ఆలోచనలు కలిగిన వ్యక్తని ట్వీట్ చేశాడు.

మరో వ్యక్తి స్పందిస్తూ.. లాక్‌డౌన్ వేళ ధోనీ ఎలాగైనా ఢిల్లీకి చేరుకుని తనకు ఫైనల్లో లభించిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డ్‌ను గంభీర్‌కు అందించాలని స్పందించాడు. కాగా అసలు ఆ క్రికెట్ వెబ్‌సైట్ సిక్సర్ షాట్ గురించే మాట్లాడిందని, భారత విజయంపై మాట్లాడలేదని ఓ నెటిజన్ గుర్తుచేశాడు.