ఆక్లాండ్: ఇండియాతో తాము విజయం సాధించడానికి పలు సానుకూలాంశాలు ఉన్నాయని, అయితే వాటిని అందుకోవడంలో తాము విఫలమయ్యామని, అందుకే ఓటమి పాలయ్యామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. తాము నిర్దేశించిన స్కోరు తక్కువేమీ కాదని ఆయన అన్నాడు. భారత్ ముందు న్యూజిలాండ్ 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే.

తాము నిర్దేశించిన లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యామని కేన్ విలియమ్సన్ అన్నాడు. తమ పేస్ బౌలింగ్ విభాగం బాగానే ఉన్నప్పటికీ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేయడంలో బౌలర్లు విఫలమయ్యారని ఆయన అన్నాడు. 

Also Read: అలా చెప్పలేదు, అద్భుతం: న్యూజిలాండ్ పై విజయంపై కోహ్లీ

ఈ పిచ్ మీద రెండు వందల పరుగులు మంచి స్కోరేనని, తమకు అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయిన భారత్ కే క్రెడిట్ దక్కుతుందని ఆయన అన్నాడు. ఇండియా క్రికెటర్లు ఏ సమయంలో కూడా తమకు అవకాశం ఇవ్వలేదని అన్నాడు. వికెట్లు తీసి ఇండియాను కష్టాల్లోకి నెడుదామనే తమ వ్యూహం ఫలించలేదని చెప్పాడు. 

ఇండదియా జట్టులో ప్రతి బ్యాట్స్ మన్ భాగస్వామ్యాలు నమోదు చేస్తూ ఎక్కడ కూడా రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నారని విలియమ్సన్ అన్నాడు. భారత ఆటగాళ్లలో ప్రతి ఒక్కరూ తమ తమ  పాత్రలను సమర్థంగా పోషించారని ఆయన అన్నాడు. వచ్చే మ్యాచ్ నాటికి గాడిలో పడటం తమకు ముఖ్యమని అన్నాడు.

Also Read: అంబటి రాయుడు శ్రేయస్ అయ్యర్: సేమ్ టు సేమ్@4

ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా రెండో ట్వంటీ20 మ్యాచు ఆదివారం జరగనుంది.