ఈ సిరీస్ లో భాగంగా ఆప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వారి యంగ్ పేసర్ నవీన్ ఉల్ హక్ కి ఊహించని షాకిచ్చింది. ఆసియా కప్ ఆడే వారి జట్టులో నవీన్ పేరు లేకపోవడం గమనార్హం.
ఆసియాకప్ 2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 30 తేదీ నుంచి సెప్టెంబర్ వరకు ఈ సిరీస్ సాగనుంది. దీనిని మినీ వరల్డ్ కప్ గా పిలుస్తుంటారు. పాకిస్తాన్, శ్రీలంక వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరుదేశాల జట్లు పాల్గొననున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ, ఆప్ఘనిస్తాన్, నేపాల్ వంటి దేశాలు ఈ టైటిల్ హోరులో పోటీపడనున్నాయి.
ఇక, ఈ సిరీస్ గెలిచేందుకు అన్ని దేశాల జట్లు తమ ప్లాన్లు వేసుకుంటున్నారు. దాదాపు అన్ని దేశాల జట్లు క్రికెటర్లను కూడా ఫైనల్ చేసేశారు. అయితే, ఈ సిరీస్ లో భాగంగా ఆప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వారి యంగ్ పేసర్ నవీన్ ఉల్ హక్ కి ఊహించని షాకిచ్చింది. ఆసియా కప్ ఆడే వారి జట్టులో నవీన్ పేరు లేకపోవడం గమనార్హం.
నవీన్ ఉల్ హక్ గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో గొడవ పడిన సందర్భంగా మీకు గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాది ఐపీఎల్ నవీన్, కోహ్లీతో గొడవ పడ్డాడు. కోహ్లీతో గొడవ పడ్డాడని, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. విపరీతంగా ఏకిపారేశారు. వీన్‌తో గొడవ కాస్తా.. కోహ్లీ-గంభీర్ గొడవకు సైతం దారితీసింది. ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ గొడవ చోటు చేసుకుంది. అయితే.. ఆ తర్వాత ఆసియా కప్ ఆరంభం అవుతుందనుకున్న సమయంలో మరోసారి వీరిద్దరు ఎలా రియాక్ట్ అవుతారో అని క్రికెట్ అభిమానులు ఆసక్తి గా ఎదురు చూశారు.
కానీ, ఆప్థనిస్తాన్ బోర్డ్ మాత్రం నవీన్ కి షాకిచ్చింది. అసలు జట్టులోకే సెలక్ట్ చేయలేదు. కోహ్లీతో వైరం కారణంగానే సెలక్ట్ చేయలేదనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక, ఈ విషయం తెలిసి కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే, నవీన్ మాత్రం జట్టులో సెలక్ట్ కానుందుకు తెగ ఫీలౌతున్నాడు. తన బాధను సోషల్ మీడియాలో పోస్టు ద్వారా తెలియజేయగా, ఆయనకు ఆయన ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు.
