టెక్ మహేంద్ర సంస్థ అధినేత, భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహేంద్ర, గబ్బా టెస్టులో భారత యువ ఆటగాళ్ల చూపించిన ప్రదర్శనకు మెచ్చి ఆరుగురుకి ఎస్‌యూవీ కార్లను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.

సీనియర్లు లేకుండా బరిలో దిగిన టీమిండియా... ఆఖరి టెస్టులో అద్భుత విజయం అందుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్, శార్దూల్ ఠాకూర్, శుబ్‌మన్ గిల్, వాసింగ్టన్ సుందర్, నవ్‌దీప్ సైనీలకు మహేంద్ర థార్ ఎస్‌యూవీ కార్లను కానుకగా ఇచ్చాడు ఆనంద్ మహేంద్ర.

ఎస్‌యూవీ కారు అందుకున్న నటరాజన్, తనకు ఈ కానుక రావడానికి కారణమైన గబ్బా టెస్టు జెర్సీని ఆనంద్ మహేంద్రకి కానుకగా పంపించాడు.

‘నా ప్రయాణం భిన్నమైంది. టీమిండియా తరుపున ఆడడమే నాకు దక్కిన గొప్ప గౌరవం... ఆనంద్ మహేంద్ర నాకు ఇచ్చిన కానుకను ధన్యవాదాలు. క్రికెట్‌పై మీ ప్రేమకి ఇది నిదర్శనం. గబ్బా టెస్టులో నా ఇన్నింగ్స్‌కి గుర్తుగా జెర్సీని పంపుతున్నా’ అంటూ ట్వీట్ చేశాడు నటరాజన్...