టీమిండియా క్రికెటర్, ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. ప్రతిరోజూ అభిమానులను సందడి చేస్తూనే ఉంటాడు. ఒకటి స్టేడియంలో మ్యాచ్ ఆడుతూ అయినా అలరిస్తాడు.. లేందంటే.. సోషల్ మీడియా వేదికగా అయినా మురిపిస్తాడు.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటే.. హార్దిక్.. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు పోస్టు  చేస్తుంటాడు. ఆ ఫోటోలు, వీడియోల్లో భార్య నటాషా, కొడుకు అగస్త్య ఉంటారు. కేవలం హార్దిక్ మాత్రమే కాదు.. ఆయన భార్య నటాషా కూడా  చాలా యాక్టివ్ గా ఉంటారు.

 

తాజాగా నటాషా.. హార్దిక్ , కొడుకు అగస్త్య కు సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.‘ నా సర్వస్వం’ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఆ వీడియో చాలా క్యూట్ గా ఉంది. కొడుకుతో కలిసి హార్దిక్ ఆడుకుంటున్నాడు. హార్దిక్ హావభావాలు.. దానికి అగస్త్య రియాక్షన్ చాలా క్యూట్ గా ఉంది. దీంతో... ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ పోస్టుకి హార్దిక్ కూడా కామెంట్ రూపంలో స్పందించాడు. హార్దిక్ కూడా ‘ నా సర్వస్వం’ అంటూ రిప్లై ఇవ్వడం విశేషం.

కొద్దిరోజుల క్రితం కూడా నటాషా ఓ ఫోటో షేర్ చేయగా అది కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. స్విమ్మింగ్ పూల్ లో కొడుకుతో కలిసి నటాషా ఆడుకుంటోంది. ఆ ఫోటోకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. 

ఇదిలా ఉండగా.. హార్దిక్ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబయి ఇండిన్స్ టీంతో అదరగొడుతున్నాడు. హార్దిక్ తో పాటు నటాషా, అగస్త్య కూడా బయో సెక్యూర్ బబుల్ లో ఉండటం గమనార్హం.