Sarfaraz Khan: సంచలన సెంచరీతో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్..
Sarfaraz Khan: ప్రిటోరియాలో జరిగిన మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ సంచలన సెంచరీతో మెరిశాడు. 2022-23 రంజీ ట్రోఫీలో సుమారు 92 యావరేజిని కలిగి ఉన్న సర్ఫరాజ్ ఖాన్ భారత్ తరఫున 41 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 71.70 సగటుతో 3657 పరుగులు చేశాడు.
Sarfaraz Khan hits 61-ball century: భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 61 బంతుల్లోనే సంచలన సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికా-ఎతో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు భారత్ -ఎ జట్టులో చోటు దక్కించుకున్న ముంబై బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం జరుగుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో 61 బంతుల్లో సెంచరీ సాధించాడు. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ లో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు ముందు మెన్ ఇన్ బ్లూ జట్టు ప్రస్తుతం మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడుతోంది.
స్టార్ బ్యాటర్ రవీంద్ర జడేజా , హర్షిత్ రాణా వంటి వారిపై నాక్ ఆడటంతో అతని బ్యాటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రిటోరియాలో జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇండియా-ఎ బ్యాట్స్ మన్ రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా వంటి స్టార్ ఆటగాళ్ల జట్టుపై శతకం బాదాడు. దేశవాళీ క్రికెట్లో అత్యంత నిలకడైన బ్యాట్స్ మన్ లలో సర్ఫరాజ్ ఒకడిగా ఉన్నాడు. 2022-23 రంజీ ట్రోఫీలో ఆరు మ్యాచ్ లలో 92.66 సగటుతో 556 పరుగులు చేశాడు.
అయితే ఇటీవల దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో సర్ఫరాజ్ ఖాన్ ను ఫ్రాంఛైజీలు పట్టించుకోకపోవడంతో అమ్ముడుపోకుండా ఉన్నాడు. ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడాడు. రిటెన్షన్ విండోలో ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన ఈ 26 ఏళ్ల ఆటగాడు ఐపీఎల్ 2024 వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైస్ కు రిజిస్టర్ చేసుకున్నప్పటికీ అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో సర్ఫరాజ్ ఖాన్ నిరాశపరిచాడు. నాలుగు ఇన్నింగ్స్ లలో కేవలం 53 పరుగులు మాత్రమే చేశాడు.