క్రికెట్‌ ప్రపంచంలో మహేంద్ర సింగ్ ధోనీకి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ధోనీ భార్య సాక్షి సింగ్‌కి కూడా ఫ్యాషన్ ప్రపంచంలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన వ్యక్తిగత ఫోటోలతో పాటు భర్త మహేంద్ర సింగ్ ధోనీ, కూతురు జివా సింగ్ ధోనీకి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది సాక్షి.

తనకు మహేంద్రసింగ్ ధోనీ చెప్పులు తొడుగుతున్నట్టుగా ఉన్న ఫోటోను సాక్షి సింగ్ పోస్టు చేయడంతో మాహీ ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు అప్పట్లో. అయితే వాటిని పెద్దగా పట్టించుకోని సాక్షి... తనకు నచ్చినట్టుగా డ్రెస్సింగ్ కూడా చేసుకుంటూ ఉంటుంది.

తాజాగా 436 రోజుల తర్వాత క్రికెట్ రీఎంట్రీ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్‌లో ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే రాంఛీలో తన ఇంట్లో ఉన్నప్పుడు తెల్ల గడ్డం, తెల్లని జుట్టుతో కనిపించిన ధోనీ... దుబాయ్ చేరేసరికి పూర్తిగా లుక్ మార్చేశాడు.

ఫ్రెంచ్ కట్ స్టైల్‌లో గడ్డం, కండలు తిరిగిన దేహాంతో ముంబై మ్యాచ్‌లో మెరిసాడు. మాహీ టీవీలో కనిపిస్తున్న ఫోటోను పోస్టు చేసిన సాక్షి సింగ్... ‘ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడో కదా...’ అంటూ కామెంట్ చేసింది.