Asianet News TeluguAsianet News Telugu

ధోనీ రికార్డులు ఏమీ చేయలేవు... గౌతమ్ గంభీర్ కామెంట్

ప్రతీ జట్టుకు కెప్టెన్ వెన్నెముకలాంటివాడు. ధోనీ కూడా అంతే. అతనికి ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. కానీ ఆ రికార్డులు విజయాన్ని తెచ్చి ఇవ్వవు. ఈసారి రైనా, భజ్జీ లేకుండా ఆడాలి. 

MS Dhoni going to tough time in IPL, Says Gautam Gambhir
Author
India, First Published Sep 17, 2020, 11:25 AM IST

భారత జట్టుకు కెప్టెన్‌గా రెండు వరల్డ్ కప్స్ అందించిన ఒకే ఒక్క కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. 16 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలు అందించిన ధోనీ, ఈ ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత, అదీ 15 నెలల గ్యాప్ తర్వాత క్రికెట్ ఆడడం ఏమంత సులువు కాదంటున్నాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. 

ప్రతీ జట్టుకు కెప్టెన్ వెన్నెముకలాంటివాడు. ధోనీ కూడా అంతే. అతనికి ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. కానీ ఆ రికార్డులు విజయాన్ని తెచ్చి ఇవ్వవు. ఈసారి రైనా, భజ్జీ లేకుండా ఆడాలి. అదీ కాకుండా ధోనీ చాలాకాలంగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు సడెన్‌గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చి, రాణించడం అంత ఈజీ కాదు. రైనా లేడు కాబట్టి ధోనీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి’.. అని చెప్పుకొచ్చాడు గంభీర్.

2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు గంభీర్. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో గంభీర్ చేసిన 97 పరుగులే జట్టు విజయంలో కీలకమయ్యాయి. అయితే ధోనీ కారణంగానే ఆ మ్యాచ్‌లో సెంచరీ చేయలేకపోయానని గౌతీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios