టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నారు. ప్రపంచకప్ తర్వాత మళ్లీ ధోనీ మైదానంలో అడుగుపెట్టింది లేదు.. దీంతో... ఆయన తన క్వాలిటీ సమయాన్ని తన ముద్దుల కుమార్తె జీవాతో గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు తన  చిన్నారి కూతురు చేసే పనులను ధోనీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. 

మొన్నటికి మొన్న కూతురితో కలిసి కారు శుభ్రం చేశారు. ఆ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా... తండ్రి ధోనీకి .. కూతురు జీవా.. తన చిన్ని చేతులతో మసాజ్ చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కాగా... దీనికి నెటిజన్లు స్పందిస్తున్నారు. 

ధోనీ హాయిగా కూర్చొని ఉంటే వెనక నుంచి జీవా మసాజ్ చేస్తోంది. అయితే... ఈ ఫోటో ఎంతో క్యూట్ గా ఉందో అంటూ నెటిజన్లు... కామెంట్స్ చేస్తున్నారు. ఈ  వీడియోని శుక్రవారం పోస్టు చేయగా.. కొద్ది సేపటికే 40వేల లైకులు రావడం గమనార్హం. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on Oct 24, 2019 at 5:19am PDT

కాగా.. ఇటీవల ధోనీ కొత్త కారు ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే... తాజాగా... ఆ నూతన వాహానాన్ని ధోనీ స్వయంగా తాను శుభ్రం చేశాడు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన తన కారును శుభ్రం చేసుకున్నారు. అయితే... ధోనీతోపాటు.. ఆయన గారాల పట్టి జీవా కూడా చేరింది. తండ్రీ, కూతుళ్లు ఇద్దరూ కలిసి మరీ కారును శుభ్రం చేశారు. 

ఇందులో ప్యాంట్‌ను పైకి మడుచుకుని.. చేతిలో వాషింగ్‌ క్లాత్‌తో ఉన్న ధోని, జీవాలను  చూస్తుంటే వారిద్దరు పనిలో చాలా బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పెద్ద పనికి.. చిన్న సాయం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది’ అనే టైటిల్‌తో ధోనీ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో  షేర్ చేయగా.. వైరల్ అయ్యింది.

ఈ వీడియోకి.. గంటలోనే దాదాపు 7 లక్షల వ్యూస్‌ రాగా వేలల్లో కామెంట్స్‌ వచ్చాయి. ‘మేము కూడా మీకు సాయం చేస్తాం ప్లీజ్‌ అంటూ కొందరు కామెంట్స్ చేయగా... ధోనీ చాలా సింపుల్  కొందరు కొనియాడుతుండటం విశేషం.